Five people from Amalapuram died in an American road accident
Road Accident In Uttarakhand : ఓ వాహనం లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) నైనితాల్ జిల్లాలో జరిగింది. మృతుల్లో ఏడుగురు నేపాలీయులని స్థానిక పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నేపాలీయులు తీవ్రంగా గాయ పడినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో మొత్తం పది మంది ఉన్నట్లు సమాచారం.
ఈ ఉదయం బేతాల్ ఘాట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకుంది. స్థానికులు, పోలీసుల సహకారంతో వీరు లోయ నుంచి మృత దేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. డ్రైవర్ రాజేంద్ర కుమార్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. నేపాల్ మూలానికి చెందిన పది మంది వ్యక్తులను పని నిమిత్తం తనక్‌పూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రక్రియను చేపట్టారు.