»Crime A Parcel Of Cocaine Has Arrived From China With Your Details Dont Believe It
Cyber Crime: మీ వివరాలతో చైనా నుంచి కొకైన్ పార్సిల్ వచ్చిందంటే? నమ్మవద్దు!
ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు దుండగులు ఇప్పుడు ఒక కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళకు ముంబాయి నుంచి కాల్ వచ్చి లక్షలు కాజేశారు.
Crime: ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు దుండగులు ఇప్పుడు ఒక కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళకు ముంబాయి నుంచి కాల్ వచ్చింది. మీ వివరాలతో ఒక కొరియర్ వచ్చింది. మీ పేరుతో ఇది తైవాన్‌కు వెళ్తుంది. అందులో కొన్న పాస్‌పోర్టులు, మత్తుమందులు ఉన్నాయి. ముంబాయి క్రైంబ్రాంచ్ కేసు దర్యాప్తు చేస్తోందని ఆ దుండగుడు మాట్లాడాడు. ముంబాయి క్రైంబ్రాంచ్ డీసీపీ పేరుతో నంబర్ ఇచ్చి సంప్రదించమని తెలిపాడు. భయపడిన ఆమె ఆ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
అంతర్జాతీయ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని బెదిరించి ఆమె ఖాతా నుంచి రూ.36.7 లక్షలు కాజేశారు. తర్వాత ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మాదాపూర్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి కూడా ఇలానే కాల్ వచ్చింది. భయపడిన ఆ యువతి కేసు నమోదు కాకుండా చూడాలంటూ అడగ్గా.. ఆమెకు మాయమాటలు చెప్పి రూ.19.5 లక్షలు కాజేశాడు. మాయమాటలు చెప్పి, బెదిరించి సైబర నేరగాళ్లు పెద్ద ఎత్తున డబ్బును దోచేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే మోసపోవద్దని.. పోలీసులు ఆశపడి మోసపోవద్దు అని ప్రచారం చేస్తున్నారు. భయంతో ఇలాంటి మాటలను నమ్మి దుండగుల చేతిలో మోసపోవద్దు. జాగ్రత్త!