కరీంనగర్: హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొక్కండ అభిలాష్ (19) ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతను సింగాపురం కిట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.