»Mimicry Bird In London Changes Voice And Disturbs Everyone Here Is The Video
Mimicry bird: మిమిక్రీ పక్షి.. గొంతు మార్చి అందరిని పరేషాన్ చేస్తుంది.. వీడియో ఇదిగో!
వింతైన పక్షి చేసే శబ్దాలు విని ప్రజలంత బయపడ్డ సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అది పోలీసు వాహనం సైరన్‌ను అనుకరించి అందరిని పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Mimicry bird in London.. changes voice and disturbs everyone.. Here is the video!
Mimicry bird: ఒక పక్షి చేసిన తుంటరి పనికి ప్రయాణికులే కాదు పోలీసులు సైతం పరేషాన్ అయ్యారు. అది చేసే శబ్దానికి పోలీసు వాహనం నుంచి సైరన్ వస్తుందా అని పోలీసులు చెక్ చేసుకున్నారు. తాము ఏ తప్పు చేయండి పోలీసులు ఎందుకు ఫాలో చేస్తున్నారని సామాన్య ప్రయాణికులు పరేషాన్ అయ్యారు. రహదారి పక్కనే చెట్టుపై వాలిన పక్షి పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింతైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థేమ్స్ వ్యాలీలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న చెట్టుపై ఓ పక్షి ఉంటోంది. చాలా రోజుల నుంచి అది అక్కడే ఉన్నట్లు వారు గుర్తించారు. అయితే అది అక్కడే ఉండి సైరెన్ శబ్దాలను వింటుంది.
అలా నిత్యం విని వని సైరెన్‌ను అనుకరిస్తూ కూత పెట్టడం స్టార్ట్ చేసింది. దాంతో అటు వాహనదారులు, ఇటు పోలీసులు తమ వాహనాలను ఆపి చెక్ చేసుకుంటున్నారు. తరువాత ఏంటని జాగ్రత్తగా గమనిస్తే అసలు విషయం బయటపడింది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ఈ పక్షి భాగమేమోనని, దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారేమో అని కొంత మంది సిటిజన్స్ భావిస్తున్నారు. అయితే లైర్ అనే పక్షి దీన్నెే మిమిక్రి పక్షి అంటారు. దీని గురించి వినే ఉంటారు. ఇది ప్రపంచంలోనే అందమైన పక్షుల్లో ఒకటి. ఇది ఇతర గొంతులను అనుకరిస్తుంది. ఇతర పక్షుల్లా మిమిక్రి చేస్తుంది. పిల్లాల, కోయిల్లా కూత పెడుతుంది. ఇది చాలా తెలివైన పక్షి దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. అయితే అది ఇది ఒకటి కాదు అని పోలీసులు తెలిపారు.
Before you read on… this is 100% real and NOT a late April Fools joke! 🚫
Officers at our Roads Policing base in Bicester have been left a little confused this week, after finding out one of their resident birds has learnt to mimic the sound of a police siren! 🚨