»Advertisement For Junior Wife No Experience Attractive Salary Linkedin Post Viral
LinkedIn Post Viral: జూనియర్ భార్య కావాలంటూ.. లింక్డిన్ లో పోస్ట్.. నెట్టింట వైరల్
ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది.
LinkedIn Post Viral: ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. ఎలాంటి అనుభవం లేనివారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. కానీ కనీసం 2 సంవత్సరాల వంట చేసిన అనుభవం ఉండాలి. రాత్రి పూట స్పైసీ బిర్యానీ చేయడం రావాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ అర్హతలు ఉంటే రెజ్యూమ్ పంపాలని సూచించారు. అయితే ఔత్సాహికులు రెజ్యూమ్ పంపే ముందు ఈ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్‌ను పూర్తిగా చదవడం మంచిది.
లింక్డ్ఇన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అర్జెంట్ హైరింగ్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చివర్లో ఇది కేవలం ప్రజల ముఖాల్లో చిరునవ్వు నింపే పోస్ట్ అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ ఇంజనీర్ చేసిన పోస్ట్ చదివాక ఒక్క క్షణం నవ్వు ఆపుకోలేరు. జూనియర్ భార్య కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రకటన నేను నా కోసం జూనియర్ భార్య కోసం వెతుకుతూ ఈ శీఘ్ర నియామక ప్రకటన చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఈ పోస్ట్ కోసం దరఖాస్తుదారులు అనుభవం కలిగి ఉండకూడదు. ఉపాధి రకం జీవితకాలం ఉంటుంది. అనుభవం లేని అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. జీతాలు గోప్యంగా ఉంచుతారు. మొత్తం మూడు రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుంది. చివరి దశ ముఖాముఖి ఇంటర్వ్యూ. ఆసక్తిగల అభ్యర్థులు జూనియర్ వైఫ్ కోసం దరఖాస్తు చేసుకోవలసిన అర్హతలను ఈ పోస్ట్ పేర్కొంది.
వంటలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. రాత్రిపూట లేచి స్పైసీ బిర్యానీ తయారుచేయగలగాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గౌరవప్రదంగా , మర్యాదగా ఉండాలి. వారు విధేయతతో , ప్రేమగా ఉండాలి. లక్ష్య ఆధారితంగా ఉండాలి (నేను అన్ని పనులు చేస్తాను, కానీ నేను ఏమి చేస్తున్నానో ఆమె అర్థం చేసుకోవాలి). ఇంత రాసి..చివరల్లో మాత్రం.. జస్ట్ ఫర్ ఫన్ అని పేర్కొనడం విశేషం.