Breaking News: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి మహేష్‌కు సీటు దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పవన్ కల్యాణ్‌పై తీవ్ర్ర విమర్శలు కూడా చేశారు. పోతిన మహేష్‌తో పాటు అతని అనుచరులు కూడా వైసీపీలో చేరారు. పోతిన మహేశ్ కు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ నేత ఆసిఫ్ బరిలో ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కే అవకాశం లేదు. పార్టీలో పనిచేయాల్సి ఉంటుంది.