Priest Sai Krishna: తమిళ బ్రహ్మిన్ అప్సర హత్య కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మర్డర్‌కు సంబంధించి పూటకో అప్ డేట్ వస్తోంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వీరిద్దరి పరిచయం, ప్రేమ కన్నా.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు సాయికృష్ణ (Sai Krishna) పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నాడట. ఓ వ్యక్తిని ఎలా చంపాలనే అంశానికి సంబంధించి నెట్లో సెర్చ్ చేశాడనే విషయం తెలిసింది.
అప్సర హత్యకు వారం రోజుల ముందు నుంచే సాయికృష్ణ (Sai Krishna) ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడట. ‘మనిషిని చంపడం ఎలా?’ అనే అంశంపై నెట్లో వెతికాడట. కోయంబత్తూర్ వెళదామని అప్సర అంతకుముందు సాయిని అడగడంతో.. దానిని తనకు అనుకూలంగా మలచుకున్నాడని తెలిసింది. ఈ నెల 3వ తేదీన రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని నమ్మించాడట. కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి.. కడతేర్చాడు.
3వ తేదీ రాత్రి 9 గంటలకు టికెట్ అని చెప్పి.. రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి (Sai Krishna) తీసుకెళ్లాడు. రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్ చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. అక్కడి నుంచి గోశాలకు తీసుకెళ్లాడట. రాత్రి భోజనం కూడా అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద చేశారు. అప్సరకు హెల్త్ బాగోలేకపోవడంతో వాంతి కూడా చేసుకుందట. అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరు సుల్తాన్ పల్లిలో గల గోశాలకు చేరుకున్నారు. నిద్రపోతున్న సమయంలో సాయికృష్ణ (Sai Krishna) హత్య చేశాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
అప్సర- సాయికి సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయం వద్ద ప్రేమ కలిగిందని తెలుస్తోంది. వారిద్దరూ వాట్సాప్ చేసుకునేవారని తెలిసింది. నవంబర్‌లో గుజరాత్లో గల సోమనాథ్ ఆలయం, ద్వారక ఆలయాన్ని సందర్శించారని తెలిసింది. వాట్సాప్ ద్వారా లవ్ చేస్తున్నానని చెప్పి.. పెళ్లి చేసుకోవాలని అప్సర అడిగిందట. ఇక అప్పటినుంచి వారి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.