»Hero Vijay Antony Daughter Lara Suicide At Tamil Nadu
Vijay antony: బిచ్చగాడు హీరో విజయ్ఆంటోని ఇంట్లో విషాదం
తమిళ్ హీరో విజయ్ ఆంటోని నివాసంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తన 17 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత గమనించిన హీరో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు మూవీ హీరో విజయ్ ఆంటోని(vijay antony) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె మీరా ఆంటోని(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మనస్థాపానికి గురై చెన్నైలోని డీడీకే రోడ్డులోని ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆ తర్వాత తన కుమార్తె గదిలో ఉరివేసుకుని ఉండటం చూసి, విజయ్ ఆంటోనీ ఇంటి సిబ్బంది సహాయంతో ఆమెను కిందకి దించి, కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలికను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రికి వచ్చి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. విజయ్ ఆంటోనీ 2006లో ఫాతిమాను పెళ్లాడాడు. వీరి కుమార్తె మీరా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ బాలిక చర్చి పార్క్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతుంది.
అలాగే సంగీత స్వరకర్త విజయ్ ఆంటోనీ కొన్ని నెలల క్రితం పిచైకరన్ పార్ట్ II షూటింగ్లో ఉండగా ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు ఇటీవలి ఓ వీడియోలో తనతో సహా పలువురిపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబ్ పై పరువు నష్టం కేసు(case)పెడతానని నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని(vijay antony) ప్రకటించారు. కొంత బాధలో ఉన్నానని, తన ప్రకటనతో కొంత వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశానని విజయ్ ఆంటోని అన్నారు. ఓ వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గురించి, తన సోదరుడు ఏఆర్ రెహమాన్ గురించి అసత్య ప్రచారం చేసిందన్నారు. ఆమె ఏది చెప్పినా అబద్ధమని విజయ్ ఆంటోని స్పష్టం చేశారు. అయితే ఆ వివాదానికి తన కుమార్తె ఆత్మహత్యకు ఏదైనా సంబంధం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.