»Lavanya Tripathi Did Pooja With Varuna Tej In Nagababu House Before Marriage Pics Viral
Varuna Tej: పెళ్లికి ముందే అత్తారింట్లో పూజ చేసిన లావణ్య త్రిపాఠి.. పిక్స్ వైరల్
వినాయక చవితి సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పెళ్లికి ముందే వరుణ్ తేజ్‌తో కలిసి అత్తారింట్లో పూజ నిర్వాహణలో పాల్గొంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Varuna Tej: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరి నిశ్చితార్థం అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక త్వరలోనే ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే పెళ్ళికి ముందే లావణ్య అత్తారింటిలోకి అడుగు పెట్టేసింది. ఈ రోజు వినాయ చవితి(Vinayaka Chavithi) సందర్భంగా అత్తారింటిలో పూజా కార్యక్రమంలో పాల్గొంది. సెలబ్రిటీస్ అంతా వారి ఇంటిలో పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు విషెస్ తెలియజేస్తున్నారు. దీన్ని పురస్కరించుకొని తాజాగా వరుణ్ కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇక ఈ ఫొటోల్లో వరుణ్ తేజ్ ఫ్యామిలీతో పాటు లావణ్య మెరిసింది. పెళ్ళికి ముందే అత్తారింటిలో పూజా కార్యక్రమంలో లావణ్య పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ జంట ఇటీవలే పెళ్లి షాపింగ్ ని కూడా మొదలు పెట్టారు. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షో రూమ్‌లో వరుణ్, లావణ్య తమ వెడ్డింగ్ కి సంబంధించిన డ్రెస్సెస్ కోసం షాపింగ్ చేశారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్ వెర్ డ్రెస్సెస్ ని సిద్ధం చేయిస్తున్నారు. వీరి పెళ్లి వేడుక ఈ ఏడాది నవంబర్ లో ఉండబోతుంది అని ఇండస్ట్రిలో వినిపిస్తున్న టాక్. అయితే వీరి వివాహం ఇటలీలోని ఓ ఫ్యాలెస్‌లో జరగనుందని సమాచారం. వీరిద్దరు మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత అంతరిక్షం సినిమాలో నటించారు. పెద్దలను ఒప్పించి వీరు ప్రేమపెళ్లి చేసుకోబోతున్నారు.