పెళ్లి అయిన సరే గ్లామర్ డోస్ తగ్గించేదే అంటోంది లావణ్య పాప. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాలను ప్రదర్శించింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Lavanya: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి (Lavanya) ఇటీవలే డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇటలీలో పెళ్లి జరగగా.. హైటెక్స్‌లో రిసెప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొత్త జంట నిహారిక మూవీ లాంచ్ ప్రోగ్రామ్‌కు కలిసి వచ్చారు. ఆడపా దడపా బయట కనిపిస్తున్నారు. దీపావళి పండుగ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెళ్లైన తర్వాత షూటింగ్‌కు వెళ్లడం లేదు. కానీ కొత్త జంట (couple) బయట కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. దంపతులు, ఫ్యామిలీ ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ గౌన్ వేసుకొని గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత కూడా ఇలా ఫోటోలు దిగడంపై అభిమానులు స్పందిస్తున్నారు.
కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసే పనిలో వరుణ్ తేజ ఉన్నాడు. వెబ్ సిరీస్, తమిళ సినిమాను లావణ్య కంప్లీట్ చేయాల్సి ఉంది. అవీ పూర్తయిన తర్వాత మూవీస్‌కు దూరమై.. నిర్మాతగా మారనుందని సమాచారం. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొత్త దంపతులు హనీమూన్ వెళతారని తెలుస్తోంది. లావణ్య కొత్త పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లయిన తర్వాత కూడా ఇలా దిగడం అవసరమా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.