రామ్ గోపాల్ వర్మ గురించి దర్శకుడు రాజమౌళి కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. ఆ వర్మ గురించి తాను ఎప్పుడూ వినలేదని రాసుకొచ్చారు.
Ram Gopal Varma: యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరైన సంగతి తెలిసిందే. దర్శకుల గురించి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రస్తావించారు. తన తరంలో.. సినిమా అంటే ఇలానే తీయాలని గిరి గీసుకొని లేరని.. గ్రేట్ అంటూ కొనియాడారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేరారని పేర్కొన్నారు. ఆ కామెంట్లపై రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. వీడియోను షేర్ చేసి.. వర్మ గురించి ఎప్పుడూ వినలేదని సరదాగా కామెంట్ చేశారు. తనపైనే తాను సెటైర్ వేసుకున్నారు. శివ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ.. పలు విభిన్న మూవీస్ తీశారు. పలువురిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తన నిర్మాణ సంస్థ ద్వారా నటీనటులు, టెక్నిషీయన్స్ చాలా మందికి లైఫ్ ఇచ్చారు.