»Car Fell Into The Canal Five People Died Mandya District Karnataka
Car fell canal: కాలువలో పడ్డ కారు..ఐదుగురు మృతి
ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ఆకస్మాత్తుగా కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Car fell into the canal Five people died mandya district karnataka
కర్ణాటక(karnataka)లోని మాండ్యా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొని మైసూరు నుంచి తిరిగి వస్తుండగా ఓ ప్రయాణికుల కారు ప్రమాదవశాత్తు కాలువ(canal)లో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మండ్య జిల్లా పాండవపుర ప్రాంతంలో బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వేశ్వరయ్య కెనాల్లో కారు పడిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు వారి మృతదేహాలను వెలికితీయడం ప్రారంభించారు. వారిలో ఐదుగురు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న టిప్టూరు గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం కారులో ఉన్న ప్రయాణికులు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మైసూరుకు వెళ్లారని తెలిపారు. బాధితుల్లో చంద్రప్పప్ప, కృష్ణప్ప, ధనంజయ్, బాబు, జయన్న ఉన్నట్లు సమాచారం. ఈరోజు పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేకాదు బాధితులు ఒకరికొకరు బంధుత్వం కల్గి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(police) విచారణ చేస్తున్నారు.