»Amazon Fake Prasad In The Name Of Ayodhya Notices To Amazon
Amazon: అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు
అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ కొందరు ఆన్లైన్లో నకిలీ ప్రసాదాలు కలకలం రేపేతున్నాయి. అయోధ్య ప్రసాదం పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
Amazon: అయోధ్య రాముడి పేరుతో కొందరు నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇలాంటి సమయంలో చాలామంది కేటుగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ కొందరు ఆన్లైన్లో నకిలీ ప్రసాదాలు కలకలం రేపేతున్నాయి. అయోధ్య ప్రసాదం పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. రామ ప్రసాదం పేరిట నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తూ ఆన్లైన్ కస్టమర్లను అమెజాన్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి లడ్డూ, ఖోయా ఖోబీ లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్ర్రసాద్, దేవీ ఆవు పాలు ఇలా కొన్నింటిని అమ్ముతున్నట్లు పేర్కొంది. ఫిర్యాదుపై స్పందించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమోజాన్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలంటూ గడువు ఇచ్చింది. లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది.