»Accident To Indian Former Cricketers Praveen Kumar Car At Meerut The Vehicle Was Crushed
Indian former cricketer: కారుకు ప్రమాదం..నుజ్జునుజ్జయిన వాహనం
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar) ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మీరట్‌లో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడు కారులోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రవీణ్‌తో పాటు అతని కుమారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రవీణ్ కుమార్ మంగళవారం రాత్రి తన ల్యాండ్ రోవర్ కారులో ఉత్తరప్రదేశ్‌లోని పాండవ్‌నగర్ నుంచి మీరట్‌కు వెళ్తున్నాడు. మీరట్‌లోని కమిషనర్ బంగ్లా వద్దకు రాగానే వేగంగా వచ్చిన ట్రక్కు ప్రవీణ్ కుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ తన కుమారుడిని రక్షించి లారీ డ్రైవర్‌ను పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోని నిందితుడు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా ప్రవీణ్ కుమార్ మీరట్(meerut)లోని బాగ్పత్ రోడ్డులోని ముల్తాన్ నగర్లో నివాసం ఉంటున్నాడు. మరోవైపు ప్రవీణ్‌కుమార్‌కు రోడ్డు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. 2007లో కూడా ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పేస్ బౌలర్ అయిన 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007 నుంచి 2012 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగా 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ప్రవీణ్ ఐపీఎల్లో 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు తీశాడు. బ్యాట్స్‌మెన్‌గా వన్డేల్లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు.