• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతు బజార్ లేక వ్యాపారుల ఇబ్బందులు

 MNCL: జన్నారంలో రైతు బజార్ లేకపోవడంతో చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగు జిల్లాలకు జన్నారం సరిహద్దుగా ఉంది. ఆయా జిల్లాలకు చెందిన చిరు వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకునేందుకు జన్నారం మండల కేంద్రానికి వస్తున్నారు. వారు కూరగాయలను, వస్తువులను అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ప్రధాన రహదారి పక్కన గుడారాలు వేసుకుంటున్నారు.

March 12, 2026 / 09:06 AM IST

వైద్యుడికి నోటీసులు.. ఎందుకంటే..?

WGL: నగరంలోని కేఎంసీలో ఫార్మకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. దయాకర్ కు తెలంగాణ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది. అర్హతలను తప్పుగా చూపించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ప్రాక్టీస్‌లో ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అర్హతలు ఉన్నట్లు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని మండలి పేర్కొంది.

March 12, 2026 / 09:05 AM IST

అక్రమ నల్లబెల్లం, స్పటిక పట్టివేత

NLG:మైనంపల్లి–పోలేపల్లి రహదారిపై ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 330 కిలోల నల్లబెల్లం, 50 కిలోల స్పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌హెచ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్లు నరసింహ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 09:05 AM IST

KPHBలో ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్

MDCL: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో KPHB వాసుల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సాయిబాబా చౌదరి వెల్లడించారు. ఈనెల 13న 5వ ఫేజ్‌లోని 9వ యార్డ్స్‌లో, 14న గోపాల్ నగర్‌లోని వెస్ట్ ఫీల్డ్ స్కూల్, 15న 6వ ఫేజ్‌లోని సీనియర్ సిటిజన్ కౌన్సిల్ బిల్డింగ్‌లో ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు కొనసాగనుంది.

March 12, 2026 / 09:05 AM IST

బాన్సువాడలో నేడు పవర్ కట్

KMR: బాన్సువాడలోని పలు కాలనీల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. శ్రీరామ, చైతన్య, శాంతినగర్, సంగమేశ్వర కాలనీలతో పాటు పాత బాన్సువాడ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కోత ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా పవర్ కట్ చేస్తామన్నారు.

March 12, 2026 / 09:05 AM IST

వెంకిర్యాలలో మహిళా దినోత్సవ వేడుకలు

BHNG: వెంకిర్యాల ప్రాథమిక పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు సమాజంలో మరింత రాణించాలని సర్పంచ్ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మంజులబాయి సర్పంచ్ నాగలక్ష్మి, ఛైర్ పర్సన్ మహేశ్వరి, అంగన్వాడి టీచర్ అరుణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు వసంత, స్కూల్ స్కావెంజర్ ఎల్లమ్మను శాలువాతో సత్కరించారు.

March 12, 2026 / 09:02 AM IST

జిల్లాలో నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకూ ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 38.4, ఐనోల్ లో 38.1, తిమ్మాజిపేట, ఊర్కొండ, తెలకపల్లిలో 37.9, కల్వకుర్తిలో 37.7, కిష్టంపల్లిలో 37.5, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 12, 2026 / 08:59 AM IST

వీపనగండ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

WNP: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వీపనగండ్ల మండల కేంద్రంలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 38.5°C, వెల్గోండ 38.3°C, కన్నాయిపల్లి 38.0°C, గోపాల్ పేట 37.6°C, వనపర్తి 37.5°C, రేవల్లి 37.4°C, ఎదుల 37.3°C డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 12, 2026 / 08:58 AM IST

నవీపేట్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ

NZB: నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీలో దొంగతనం జరిగింది. గురువారం ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకం ఆనంద్ అనే వ్యక్తి ఈ నెల 8న NZBలో తన కూతురు ఇంటికి వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి తులంన్నర బంగారం, నగదు అపహరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 12, 2026 / 08:55 AM IST

కస్తూర్భా గాంధీ ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు జారీ

NZB: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నవీపేట మండలం మోకన్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ కవితతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీ రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు వీరిరువురికి వేతనాలను నిలిపివేస్తూన్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

March 12, 2026 / 08:55 AM IST

నేడు జిల్లాకు మంత్రి రాక.

MGL: ఇంచర్ల గ్రామంలోని ఎమ్మార్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారు.మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు అశోక్ కోరారు.

March 12, 2026 / 08:51 AM IST

ఊర కుక్కల పట్టివేత

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఇబ్బందిగా తయారైన ఊర కుక్కలను పట్టివేశారు. గ్రామంలో ఊర కుక్కల బెడద పెరిగిపోవడం, కుక్కలకు సంక్రమించిన చర్మవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో ఊర కుక్కలను బంధించి పట్టుకెళ్లారు. వాటికి శస్త్ర చికిత్సలు వైద్యం అందించి తీసుకురానున్నట్లు తెలిపారు.

March 12, 2026 / 08:50 AM IST

‘పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించాలి’

KMR: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సకాలంలో న్యాయం అందిస్తూ, పారదర్శకమైన సేవలతో ‘సిటిజన్ ఫ్రెండ్లీ’ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని SP రాజేష్ చంద్ర ఆదేశించారు. బుధవారం సాయంత్రం SP కార్యాలయంలో సెక్షన్ ఇన్‌ఛార్జ్‌ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విధుల్లో చురుకుతనం, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించినప్పుడే వృత్తిపరంగా రాణించగలరని తెలిపారు.

March 12, 2026 / 08:46 AM IST

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

WGL: చౌరస్తాలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఓ షాప్‌పై నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 860 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,30,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో షాప్ యజమాని రాజ్ పురోజ్ భవాని సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

March 12, 2026 / 08:45 AM IST

నల్గొండలో బరి తెగిస్తున్న వడ్డీ మాఫియా

నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది.

March 12, 2026 / 08:44 AM IST