• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లా రైతులకు కలెక్టర్ కీలక సూచనలు

GDWL: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో భాగంగా ఇవాళ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలపై ప్రజా ప్రతినిధులకు ఆయన వివరించారు. అలాగే పీఎం ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

March 12, 2026 / 05:31 PM IST

‘రేపు ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు’

SDPT: రంజాన్ మాసం సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందును శుక్రవారం నిర్వహించనుంది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఈ విషయాన్ని తెలిపారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో శుక్రవారం సాయంత్రం మదీనా ఫంక్షన్ హాల్లో జరిగే ఈ విందుకు ముస్లిం ప్రజలు హాజరుకావాలన్నారు.

March 12, 2026 / 05:30 PM IST

‘ప్రజా సమస్యలపై BRS పార్టీ పోరాడుతుంది’

BDK: జిల్లా వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, BRS పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.

March 12, 2026 / 05:30 PM IST

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లిలో కుమ్మరికుంట శంకరయ్య (73) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. 6 నెలల క్రితం శంకరయ్య సైకిల్ పైనుంచి పడగా కాలులో రాడు వేశారు. రాడు నొప్పి భరించలేక, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని, కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

March 12, 2026 / 05:28 PM IST

మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం

MHBD: కొత్తగూడ మండలంలోని ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. మారుమూల గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవకుండా ఉండాలనే లక్ష్యంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి రూ. 5 కోట్ల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఇవాళ మంత్రి సీతక్క చిత్రపటానికి విద్యార్థులు, యువత, పాలాభిషేకం చేశారు.

March 12, 2026 / 05:27 PM IST

ఇఫ్లూలో సపోర్టింగ్ స్టాఫ్‌కు చీరాల పంపిణీ

MDCL: హైదరాబాద్‌లోని ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా NTSWA ఉపాధ్యక్షుడు మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో సహాయక సిబ్బందికి చీరాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ నాగరాజు పాల్గొన్నారు. వారితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 12, 2026 / 05:20 PM IST

ఇఫ్లూలో సపోర్టింగ్ స్టాఫ్‌కు చీరాల పంపిణీ

MDCL: హైదరాబాద్‌లోని ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా NTSWA ఉపాధ్యక్షుడు మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో సహాయక సిబ్బందికి చీరాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ నాగరాజు పాల్గొన్నారు. వారితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 12, 2026 / 05:20 PM IST

‘131 మంది విద్యార్థులు గైరాజరు’

SRCL: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలలో 131 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4,295 విద్యార్థులకు గాను 4,164 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించారు. పరీక్షలను జిల్లా అధికారులు పర్యవేక్షించారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని వివరించారు.

March 12, 2026 / 05:18 PM IST

నీటి ట్యాంక్ ఎక్కి తనిఖీ చేసిన కలెక్టర్

KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివనగర్ మండలంలో పర్యటించి, స్వయంగా 90 KL సామర్థ్యం గల OHSR నీటి ట్యాంక్‌ను ఎక్కి పరిశీలించారు. పారిశుధ్య పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అంకితభావంతో పనిచేస్తున్న కార్మికులు బుచ్చయ్య, ప్రవీణ్‌లను అక్కడే సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యం పట్ల కలెక్టర్ చూపిన ఈ చొరవకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

March 12, 2026 / 05:16 PM IST

సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెంలో రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు నిర్మించిన నూతన కరెంట్ సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

March 12, 2026 / 05:16 PM IST

ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి: మంత్రి

MLG: గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాల నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు.

March 12, 2026 / 05:16 PM IST

ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ

WNP: పోలీస్ శాఖ ద్వారా ‘అరైవ్-అలైవ్’ అనే థీమ్ ఏర్పాటుచేసి ప్రజలకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు ఖచ్చితంగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.

March 12, 2026 / 05:13 PM IST

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ASF: రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో PACS మాజీ వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్ తండ్రి వేంకటి గౌడ్ జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన విలేజ్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్‌ను MLA కోవ లక్ష్మి గురువారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

March 12, 2026 / 05:09 PM IST

HPV వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో గురువారంHPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 12, 2026 / 05:09 PM IST

‘హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వినతి’

HYD: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని TWJF, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) ప్రతినిధులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి సేవలందిస్తున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు వారికి వివరించారు.

March 12, 2026 / 05:08 PM IST