• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళల వేషధారణలో వికలాంగుల నిరసన

VKB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగులకు హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. పరిగి బస్టాండ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ బృందం పంజాబీ డ్రెస్సులు వేసుకుని మహిళల వేషధారణలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చడంలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

March 12, 2026 / 12:11 PM IST

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి

JGL: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురిలో ఆశావర్కర్లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తున్నామని,  అందులో భాగంగానే క్షేత్రస్థాయి కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

March 12, 2026 / 12:10 PM IST

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు: SI

BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో గురువారం SI పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కులం, మతం, వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంటుందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

March 12, 2026 / 12:07 PM IST

డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. నేడు నిర్వహించిన కార్యక్రమానికి మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జ్యోతి శివరాజ్ పాల్గొన్నారు.

March 12, 2026 / 12:07 PM IST

శాసనపల్లిలో నీటి ఎద్దడి తీర్చిన సర్పంచ్

NRPT: నారాయణపేట మండలం శాసనపల్లిలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ రవికుమార్ గౌడ్ పరిష్కరించారు. మైసమ్మ గుడి వద్ద నూతనంగా బోరు వేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జాతర సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు.

March 12, 2026 / 12:07 PM IST

కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 42 కుటుంబాలకు రూ. 42,04,872 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

March 12, 2026 / 12:06 PM IST

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎంఈఓ

NGKL: వంగూరు మండల నూతన విద్యాధికారి (MEO) గా గురువారం కొండల్ రెడ్డి మండల విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి స్వాగతం తెలిపారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తానని పేర్కొన్నారు.

March 12, 2026 / 12:06 PM IST

పశువులకు గాలికుంటు నిరోధక టీకాలు

KMR: బీర్కూర్ మండలంలోని బైరాపూర్‌లో గురువారం ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. పశువైద్యాధికారి మారుతి మాట్లాడుతూ.. పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు వేయాలని పాడి రైతులకు సూచించారు. మొత్తం 308 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి, గోపాలమిత్ర నాగార్జున, రైతులు పాల్గొన్నారు.

March 12, 2026 / 12:05 PM IST

‘ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాయవచ్చు’

MNCL: ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలను బాగా రాయవచ్చని ఖానాపూర్ మండలంలోని సర్పంచులు నవీన్ యాదవ్, పేట్టెం రాధ సూచించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 12, 2026 / 12:05 PM IST

‘కాంపౌండ్ వాల్ పనులను నాణ్యతగా నిర్మించాలి’

SDPT: కాంపౌండ్ వాల్ పనులను నాణ్యతగా నిర్మించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. మిరుదొడ్డి మండలం అల్వాల ఎక్స్ రోడ్ చెప్యాల వద్ద ఉన్న పీఎంశ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

March 12, 2026 / 12:05 PM IST

షాద్‌నగర్ మున్సిపల్ పాలకవర్గానికి శిక్షణ తరగతులు

RR: ప్రజాపాలన-ప్రగతిప్రణాళికలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పాలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ తరగతులకు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయన్నారు.

March 12, 2026 / 12:03 PM IST

కల్తీ కారం ఫ్యాక్టరీపై కేసు నమోదు

WGL: ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలోని సాయి సిద్దార్థ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రూ.4 లక్షల విలువైన నిల్వ చేసిన కల్తీ కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇండస్ట్రీ నిర్వాహకుడు సురేష్‌ను టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ స్థానిక ఎనుమాముల పోలీసులకు అప్పగించారు. కల్తీ కారం తయారీపై కేసు నమోదు చేశారు.

March 12, 2026 / 12:01 PM IST

రామప్ప శిల్పకళపై ఆశన్న ప్రశంసలు

MULG: వెంకటాపూర్ మండలం పాలంపేట కాకతీయుల కాలం నాటి కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ మావోయిస్టు అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు (ఆశన్న) అన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్లు విజయ్ కుమార్, వెంకటేష్ వద్ద నుంచి రామప్ప దేవాలయ చరిత్ర గురించి ఆశన్న తెలుసుకున్నారు.

March 12, 2026 / 11:58 AM IST

రాపర్తి అనూష బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి

BDK:మణుగూరు చాకలి ఐలమ్మ నగర్ ప్రాంతానికి చెందిన రాపర్తి అనూష బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా టైఫాయిడ్ జ్వరం‌తో బాధపడుతూ, చికిత్స పొందారు. రోజురోజుకు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

March 12, 2026 / 11:58 AM IST

లింగారెడ్డిపల్లిలో సామూహిక వనభోజన వేడుకలు…

NGKL: లింగారెడ్డిపల్లిలో నేడు సామూహిక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ప్రతి కుటుంబం ఈ వేడుకలో భాగస్వాములు కావాలని పంచాయతీ కార్యాలయం కోరింది. పచ్చని చెట్ల నీడన గ్రామస్థులందరూ కలిసి వంటలు వండుకుని, సహపంక్తి భోజనాలు చేయడం ద్వారా ఐకమత్యాన్ని చాటనున్నారు. ఈ వేడుక పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు మంచి వేదిక కానుంది.

March 12, 2026 / 11:57 AM IST