KNR: జవహర్ నవోదయ విద్యాలయం ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించిన చొప్పదండికి చెందిన పురెళ్ల సహస్రను కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. గురువారం తమ నివాసంలో కలిసిన సహస్రకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నిర్థిష్ట లక్ష్యం, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీస్సులు అందచేశారు. ఇందులో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NRML: మామడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈనెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్యాల రాజారెడ్డి కోరారు. సమావేశంలో భక్తులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు.
ADB: బేల మండలం సిర్సన్న గ్రామంలో అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడుగు పడింది. జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువత చొరవతో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
SRCL: వేములవాడలో రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముస్లింలతో కలిసి ఉపవాస విరమణ చేయించినారు.
PDPL: ఓదెలలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్‌ను గురువారం సాయంత్రం ప్రారంభించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.
JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన గోడిశాల చంద్రశేఖర్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 2,50,000 ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
KMR: వర్ని మండలంలోని శ్రీనివాస కాలనీ, ఉర్దూ మీడియం హై స్కూల్‌లో అలాగే రుద్రూర్ మండలంలోని షాదిఖానలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
MNCL: నెన్నెల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మేన హరీశ్ గౌడ్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నియమించి నియామక ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. హరీశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
BHNG: కొండగడపలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మోత్కూరులో ఉగాది అంటే బోనాల పండుగగా ప్రసిద్ధి చెందగా, ఇక్కడ మాత్రం వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ ఆచారం గత కొన్ని దశాబ్దాలుగా వస్తోందని, గ్రామస్థులంతా ఏకమై పంచాంగాన్ని వినడం ఇక్కడి ప్రత్యేకత అన్నారు.
KMR: ఉగాది పర్వదినం పురస్కరించుకొని పల్వంచ(మం) ఫరీద్ పేట్ వాసి జానపద కళాకారుడు దేవాగౌడ్‌ను ‘భారత్ బ్రాండ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ జాతీయస్థాయి ఉత్తమ ఉగాది సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం మెయిల్ ద్వారా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు ఆయన HIT TV APPతో తెలిపారు. దేవాగౌడ్‌ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించిన ఆ సంస్థ ఈ అవార్టును ప్రకటించింది.
SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాత్రి ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ మామూలుగానే ఉండగా ఒక్కసారిగా భక్తులు భారీగా పెరిగిపోవడంతో ఆలయ అధికారులు రద్దీకి అనుకున్నగా చర్యలు గైకొన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
HYD: బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో వినియోగదారుల హక్కులు, పదార్థాల ప్రమాణాలకు సంబంధించి అవగాహన కల్పించారు. మనం కొనుగోలు చేసే పదార్థాలపై BIS మార్కు ఉందా..? లేదా..? అనేది గమనించుకొని, కొనుగోలు చేయాలని CGO సువర్ణ సూచించారు. నగరంలో ప్రతి ఒక్కరు ప్రమాణాల విలువలను తెలుసుకోవడం మంచిదన్నారు.
WGL: గీసుగొండ మండలంలోని BJP జిల్లా కార్యాలయంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ కంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక, బ్రహ్మశ్రీ డా.కాళేశ్వరం సుమన్ శర్మ పంచాంగం వినిపించారు. రాబోయే ఏడాదిలో దేశ కాల పరిస్థితుల గురుంచి వివరించారు.
MHBD: పట్టణ కేంద్రంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. MLA డా.భూక్యా మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా.ఉమమురళీనాయక్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించగా, వారు శ్రద్ధగా విన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి-రమేష్, తదితరులున్నారు.
HNK: కమలాపూర్ మండలం శనిగరం తాటి వనంలో గంజాయి సేవిస్తున్నారని సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి పట్టుకున్నట్లు సీఐ నవీన్ తెలిపారు. పట్టుబడిన వారు ముగ్గురు మైనర్లు అని గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.