• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపటి నుంచి నైట్ బజార్ బంద్.!

HYD: రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు పండుగ కావడంతో ఈ ప్రత్యేక షాపింగ్‌కు తెరపడనుంది. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

March 20, 2026 / 01:29 PM IST

దుప్పటి గట్టులో పంచాయతీ కార్యాలయం ప్రారంభం

NRPT: కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టులో పంచాయతీ భవనం లేక అద్దె భవనంలో పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ గోనేటి వెంకటేశ్ పంచాయతీ కార్యాలయంగా ప్రారంభించారు. అద్దె భవనంలో ఇబ్బందులు ఉండడంతో వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:26 PM IST

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంఈవో

GDWL: మానవపాడు మండలంలోని అమరవాయి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో శివప్రసాద్ సందర్శించారు. ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు బోధన ఎలా చెప్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను చదివించారు.

March 20, 2026 / 01:26 PM IST

చేగుంట పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

NRPT: కృష్ణ మండలంలోని చేగుంట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రల్లో విద్యార్థులు పాఠశాలను సందర్శించి పరిశీలించడం ఆకట్టుకుంది. కలెక్టర్‌గా సన్నిధి, డీఈవోగా శివప్రసాద్, ఎంఈవోగా నిరజా బాధ్యతలు నిర్వర్తించారు.

March 20, 2026 / 01:24 PM IST

ఏబీవీపీ నిరసన అడ్డుగింత పోలీసులతో వాగ్వాదం.

MDK: రామాయంపేట పట్టణ బస్టాండ్ వద్ద ఏబీవీపీ నాయకులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనను నిలిపివేయాలని ఆదేశించడంతో పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ కో-కన్వీనర్ ప్రశాంత్ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

March 20, 2026 / 01:23 PM IST

ఆలయ ప్రధాన అర్చకులకు ఉగాది పురస్కారం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారి సురేష్ శర్మకు ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సురేష్ శర్మ ఉగాది పురస్కారం పొందారు. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

March 20, 2026 / 01:20 PM IST

లిఫ్ట్ షెడ్ నిర్మాణ భూమిపూజలో ఎస్పీ

MBNR: జిల్లా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (MT) పూల్‌లో హైడ్రాలిక్ లిఫ్ట్ షెడ్ నిర్మాణానికి జిల్లా ఎస్పీ డి. జానకి భూమిపూజ నిర్వహించారు. ఈ లిఫ్ట్ ద్వారా వాహనాల ఆయిల్ మార్పిడి, వాషింగ్, మరమ్మత్తులు సులభంగా జరగడంతో పాటు ఖర్చులు తగ్గి, వాహనాలు ఎప్పటికప్పుడు డ్యూటీకి సిద్ధంగా ఉంటాయని ఆమె తెలిపారు.

March 20, 2026 / 01:18 PM IST

ఈ నెల 27 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు

HYD: కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ఘనంగా జరుగనున్నాయి. 8 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 27న అంకురార్పణ, 28న ధ్వజారోహణ, శేషవాహన సేవలు, 29న గోపవాహనం, హనుమంతవాహనం, 30న కళ్యాణోత్సవం, 31న వసంతోత్సవం, ఏప్రిల్ 1న పల్లకీసేవ, రథోత్సవం, 2న మహాభిషేకం, 3న ముగింపు వేడుకలు ఉంటాయన్నారు.

March 20, 2026 / 01:17 PM IST

చదువు మన తలరాతను మారుస్తుంది: ఛైర్మన్

HNK: చదువు మన తలరాతను మారుస్తుందని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. ఆత్మకూరులోని సెయింట్ థెరీసా స్కూల్‌లో అకాడమిక్ ఎక్సలెంట్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ఛైర్మన్ హాజరయ్యారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.

March 20, 2026 / 01:17 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

RR: మియాయర్ మెట్రో గ్రౌండ్‌లో, మియాపూర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. యువతతో కలిసి క్రికెట్ అడి, టోర్నమెంట్ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:14 PM IST

‘పర్యావరణ పరిరక్షణకు పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే’

SRCL: పర్యావరణ పరిరక్షణకు పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమేనని, వేములవాడ న్యూ అర్బన్ కాలనీ పాఠశాల హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ పాఠశాల విద్యార్థులతో పిచ్చుక గూళ్ళు, ఆహార ధాన్యాలు, నీటి సమకూర్చుటపై ప్రాజెక్టు నిర్వహించారు.

March 20, 2026 / 01:12 PM IST

చేనేత సమస్యలపై 25న ‘మహా ధర్నా’

NLG: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 25న HYD ఇందిరా పార్కు వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. చేనేత భరోసా, త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమా, రుణమాఫీ, సహకార ఎన్నికల నిర్వహణే ప్రధాన డిమాండ్లతో మహా ధర్నా జరుగుతుందని పేర్కొన్నారు. గత పోరాటాల వల్లే రుణమాఫీ సాధ్యమైందని గుర్తు చేశారు.

March 20, 2026 / 01:10 PM IST

కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను గౌరవిస్తుంది: రూపేష్ రెడ్డి

ADB: పార్టీ బలోపేతం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లి రజినికాంత్‌ను యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. నాయకులు విట్టల్ రెడ్డి, నాగరాజు, రాకేష్, రవి తదితరులున్నారు.

March 20, 2026 / 01:10 PM IST

రావుట్లలో రాళ్ల వర్షం…రైతులు తీవ్ర ఆందోళన

NZB: సిరికొండ మండలం రావుట్ల-పిప్పిరి మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోతకు వచ్చిన పంట గింజలు నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 20, 2026 / 01:10 PM IST

పశువుల వారసంత వేలంపాట మళ్లీ వాయిదా

MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లిలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను మళ్ళీ వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ మాధవి రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వారసంత వేలం పాటను నిర్వహించిన నిర్దేశిత అప్సెట్ ధర రాకపోవడంతో మార్చి 24కు వేలం పాటను వాయిదా వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూపతి, వార్డ్ సభ్యులు ఉన్నారు.

March 20, 2026 / 01:09 PM IST