SRCL: విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి అని NPDCL CE అశోక్ అన్నారు. సిరిసిల్ల పరిధిలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ భద్రత, వినియోగదారుల సేవలు, వ్యవస్థ మెరుగుదలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఉద్యోగి జీవితం విలువైనదని భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు.
KMR: జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు పెద్ద ఎక్లరా గ్రామ సర్పంచ్ సోమవర్ మహేష్ మండల అధ్యక్షుడు దారస్ సాయిలు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.
HYD: మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటి నాణ్యతపై జీహెచ్ఎంసీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. మొత్తం 26 చోట్ల పరిశీలించి, 27 నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపింది. వీటిలో ఎక్కువగా లూజ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్ల నుంచే నమూనాలు తీసుకున్నారు. నిబంధనలు పాటించని 6 యూనిట్లకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య రక్షణ కోసం కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.
RR: శేరిలింగంపల్లి గోపి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. చెరువు శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం పెంపు లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన మట్టి, చెత్తను యంత్రాలతో తొలగిస్తూ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో వర్షాకాలంలో నీటి నిల్వ మెరుగుపడి, పరిసర ప్రాంతాలకు ఉపశమనం కలగనుంది.
శ్రీరంగాపూర్ మండలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేసవిలో మూగ జీవులకు తాగునీరు గగనమైంది. ఉపాధి హామీ పథకం కింద రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టెలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక తొట్టెలన్నీ ఎండిపోవడంతో మండల కేంద్రంతో పాటు కంబలాపూర్, తాటిపాముల తదితర గ్రామాల్లో పశువులు దప్పికతో అలమటిస్తున్నాయి.
VKB: తాండూరుకు చెందిన మోయిజ్ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 7, 9తేదీల్లో నేపాల్లోని ఖాట్మండులో జరిగే ‘షూటింగ్ బాల్ సిరీస్-2026’లో భారత్ తరపున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
WGL: జిల్లా వ్యాప్తంగా GP కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. వివిధ డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు వేరే ప్రాంతాల్లో పని చేస్తుండగా, జీతాలు మాత్రం పాత కార్యాలయాల నుంచే వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవులు, జీతాల కోసం పాత కార్యాలయాలను ఆశ్రయించవలసి వస్తుందని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.
MDK: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు. ఆఫీసులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేసి సీఎం ఫొటో పెట్టారు. గజ్వేల్ ఘటనను ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం ఆదేశాలతోనే జరిగిందన్నారు.
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని శ్రీ మహా కాళేశ్వర దేవస్థానం మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కాల నాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్‌తో కలిసి సందర్శించారు. ముందుగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్రను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ వివరించారు.
NRPT: నేడు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి చేతుల మీదుగా “జాజమ్మ” చెరువు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాయకులు కుంభం శివకుమార్ రెడ్డి, శివారెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. నారయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇది నాంది పలుకుతుందని స్థానికులు పేర్కొన్నారు.
GDWL: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సరిత శనివారం ప్రారంభించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం స్థానికులకు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.
BDK: విద్యానగర్ పంచాయతీ పరిధిలోని సారయ్య కాలనీలో మిషన్ భగీరథ అధికారులతో కలిసి సర్పంచ్ శాంతిశ్రీ శనివారం పర్యటించారు. చుంచుపల్లి విద్యానగర్ పంచాయతీలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా మెరుగుదలకు పాలకవర్గం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాలనీలో కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు, ట్యాంకు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పేర్కొన్నారు.
BHPL: గణపురం, గొర్లవీడు గ్రామాల్లో మక్కల కొనుగోళు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
NZB: సిరికొండలోని కొండాపూర్ గొప్య తండా, కాశవాడ అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం అన్నప్రాసన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మంజుల ఆధ్వర్యంలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన చేయించారు. చిన్నారుల ఆరోగ్య కరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం పిల్లల పోషణ, ఆరోగ్యంపై తల్లిదండ్రులకుఅవగాహన కల్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా, మున్సిపల్ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శరత్ మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.