NRPT: జిల్లాలో గురువారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రజలు 08506-281182 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులను చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
BHPL: గణపురం మండలం అప్పయ్యపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాతృమూర్తి కమలమ్మ నేడు స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి సాయంత్రం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు 3.17 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌లకు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 1492లో ఉన్న ఈ భూమి ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎస్ఎస్సీ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలతో వారికి గల అనుభవాలను పంచుకున్నారు
NLG: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరు’ అని అన్నారు. కాగా, బుధవారం దేవరకొండ పట్టణంలో చందంపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
NLG: దేవరకొండ పట్టణంలో చందంపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో ఇవాళ పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరు’ అని అన్నారు.
JN: పాలకుర్తిలో బీజేపీ బుధవారం పండిట్ దీనదయాళ్ ఉపాద్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్తకు శిక్షణ అవసరం అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నారు అని అన్నారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులు నాణ్యతగా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి పాల్గొన్నారు.
MHBD: చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్‌గా అయూబ్ పాషా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఆయనను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి గత BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మాజీ MLA రెడ్యానాయక్, తదితరులున్నారు.
WNP: కొత్తకోట మండలం వడ్డెవాట తండాకు చెందిన పాత్లావత్ ఠాగూర్ నాయక్‌కు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, సర్పంచ్ రాంలాల్ నాయక్ పాల్గొన్నారు.
WGL: రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నూతన అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని వారు సూచించారు. స్వర్ణ మాట్లాడుతూ.. మహిళా క్షేత్రంలో పార్టీకి బలం చేకూర్చడం తన ప్రధాన లక్ష్యం అని అన్నారు.
MDK: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ రఘునందన్ రావు రూ.2.4 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డమ్ మల్లేష్ గౌడ్ తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్వాడీలు, మహిళా భవనాలు, పాఠశాల ప్రహరీ గోడలు, బోర్ల ఏర్పాటు కోసం ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
SRPT: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) నాయకులు మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పాలూరి అంజయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కార్మిక సంఘాల JAC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ కార్మికులు మందుల కోసం వెళితే బీజోన్ ఆసుపత్రికి రిఫర్ చేయడం అనివార్యం అయిపోయిందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్యం అందడం లేదన్నారు.