• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టెన్త్ ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

February 26, 2026 / 06:17 AM IST

రాష్ట్రస్థాయిలో గెలిచిన జిల్లా క్రీడాకారులు

JGL: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్-2025లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. పాల్గొన్న వారు కబడ్డీ, ఖో-ఖో, యోగ, బాస్కెట్బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించారు. బాస్కెట్బాల్, ఖో-ఖోలో కాంస్యాలు, బాక్సింగ్, యోగ, జావెలిన్ త్రో, కిక్ బాక్సింగ్లో రజత పతకాలు దక్కాయి. వారిని కలెక్టర్ అభినందించారు.

February 26, 2026 / 06:16 AM IST

రజకులపై దాడిని ఖండించిన బీసీ సంఘం

SRCL: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని, ఆ ఘటనలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడాన్ని బీసీ సాధికారిత సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం వేములవాడలోని సంఘం కార్యాలయంలో మృతి చెందిన చిన్నారికి సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

February 26, 2026 / 06:12 AM IST

మహిళ సిబ్బంది సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలి: SP

ADB: మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించనున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మార్షల్ ఆర్ట్స్, కరాటే శిక్షణను 3 రోజుల పాటు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సిబ్బంది స్వీయ రక్షణతో పాటు సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలని కోరారు.

February 26, 2026 / 06:11 AM IST

టాస్క్ సెంటర్లో ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్

SDPT: సిద్దిపేట ఐటీ టవర్లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గురువారం సాయంత్రం లోగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం మొదటి 200 మందికి అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 06:11 AM IST

‘వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం’

ASF: TGNPDCL సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348 కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ ఫిర్యాదుతో ID వస్తుందని తెలిపారు. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుదన్నారు.

February 26, 2026 / 06:10 AM IST

నేడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు

MNCL: కాసిపేట్ మండలంలో గురువారం MLA గడ్డం వినోద్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మ. 3 గంటలకు తాటిగూడలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మ 3:30 గంటలకు కల్లం గూడలోని రూ. 1.39 కోట్లతో BT రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. సా. 4 గంటలకు మద్దిమాడలో గ్రామపంచాయతీ భవన ప్రారంభత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

February 26, 2026 / 06:10 AM IST

పెద్దపల్లిలో నిరుద్యోగులకు TASK ఉచిత శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023–2026లో డిగ్రీ, పాలిటెక్నిక్, మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన వారు అర్హులు. నమోదు FEB 25–28 వరకు, శిక్షణ MAR 2–22 వరకు ఉంటుంది. మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి.

February 26, 2026 / 06:08 AM IST

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి

WNP: వీవనగండ్ల మండలం కల్వరాల గ్రామాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అదే విధంగా మహిళా సంఘం బిల్డింగు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వరాల సర్పంచ్ బండారాముడు, ఉప సర్పంచ్ తడకల రంగమ్మ, వార్డ్ మెంబర్లు, అఖిల్ పాషా పూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:07 AM IST

సబ్సిడీపై వరిగడ్డి కట్టే మిషన్ల పంపిణీ

SRPT: మునగాల మండలం గణపవరం రైతు సావిత్రి, కృష్ణకు 50% సబ్సిడీతో వరిగడ్డి కట్టే మిషన్‌ను ఏవో రాజు పంపిణీ చేశారు. మండలంలో ఇంకా 4 ఎస్సీ, 2 ఎస్టీ కోటా మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులు ఈ శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు.

February 26, 2026 / 06:07 AM IST

ఈనెల 27న ధర్‌పల్లిలో ఇసుక వేలం

NZB: ధర్‌పల్లి మండలం కొటాల్ పల్లి, హోన్నజీపేట్ గ్రామాల్లో ఇటీవల అక్రమంగా డంపు చేసిన 200 ట్రాక్టర్ల ఇసుకను ఈనెల 27న తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వేలం వేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు

February 26, 2026 / 06:04 AM IST

‘యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి’

NLG: 2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్‌లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 26, 2026 / 06:04 AM IST

స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DYSO రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు(10 బాలురు,10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు https://tgss.telangana.gov.in/ ద్వారా ఇవాళ నుంచి MAR 4 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు

February 26, 2026 / 06:03 AM IST

కాటారంలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

BHPL: కాటారంలోని ఓ హైస్కూల్‌లో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ సూచనలు పాటించే అవసరం వివరించారు. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు, సీసీ కెమెరాల ప్రయోజనం గురించి తెలిపారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గి సురక్షిత ప్రయాణం సాధ్యమని సూచించారు.

February 26, 2026 / 06:03 AM IST

ప్రైవేటు రంగాల్లో సైతం యువత రాణించాలి: కలెక్టర్

ADB: మావల మండల కేంద్రంలోని N-Labs ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సంస్థను కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం పనితీరు, సిబ్బంది వివరాలను ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాకు వివరించారు. యువత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగాలలో సైతం రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ప్రణవి, అంకిత్, దినేష్ ఉన్నారు.

February 26, 2026 / 05:47 AM IST