SDPT: చేర్యాల పట్టణం అన్ని వార్డులో కోతులు సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లపై గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదీన నాగరాజు విషయం తాగాడు. ఖమ్మంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MDK: విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజా బాట కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని బోధి బుడోకాన్ కరాటే అసోసియేషన్ విద్యార్థులు HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు బయలుదేరారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నట్లు మాస్టర్లు ముకేశ్, రాము తెలిపారు. జిల్లాస్థాయిలో సత్తా చాటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం 13 విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలోని పర్యాటక రంగం త్వరలోనే సరికొత్త రూపు సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఆదాయం వెళ్లడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పలు కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించారు. లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్టలపై రోప్ లెవెల్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
SRD: నారాయణఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్‌పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భయంగా ఉంది చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంలో పాపయ్యకు సంబంధించి వస్తువులు, బైక్, సెల్ ఫోన్ గుర్తించి హద్నూర్ పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
GDWL: కేటిదొడ్డి గ్రామ రైతులు తమ రబీ సీజన్ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు రిజిస్టర్, పంట వివరాల నమోదు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సాయం పొందేందుకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
VKB: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. 8332957830 నంబర్ నుంచి ఫోన్ చేసి, ఆస్తి పన్ను చెల్లించాలని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎత్తవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
RR: ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర సమితి సభ్యుడుగా రెండవసారి షాద్‌నగర్ పట్టణానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం విద్యార్థి లోకానికి అండగా ఉండి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు తక్షణ సహాయం అందజేశారు. ఆయన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్మక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదులు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
BDK: అశ్వాపురం టీడీపీ సెంటర్‌లో శనివారం తెల్లవారుజామున మణుగూరు నుంచి అక్రమంగా మొరంపల్లి బంజరుకు ఓ వాహనములో బంధించి తరలిస్తున్న 12 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్లు స్థానిక సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గురుభక్తి చాటుకున్నారు. నస్పూర్ పరిధి సీతారాంపల్లిలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుడు జాడి శంకరయ్యకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓనమాలు నేర్పడంతో పాటు చిన్ననాటి నుంచి తన ఎదుగుదలకు ఉపాధ్యాయుడు శంకరయ్య పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు.
WNP: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 13, ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాలను కలెక్టర్ కార్యాలయం నుంచి తరలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లలో పటిష్ట భద్రత మధ్య భద్రపరుస్తున్నారు.
NGKL: రాష్ట్ర పంచాయతీరాజ్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జిల్లా వాసి సుగుణాకర్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆయన కోరారు.
SRCL: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 22న (ఆదివారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి గంభీరాపేట్‌లో బయోస్ట్రాటమ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు భూమిపూజ నిర్వహించి రైతులతో సంభాషిస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.