భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం సమీపంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటికే లభ్యం కాగా, తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SRCL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని సుందరయ్య నగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరంలో 263 మందిని పరీక్షించి మందులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, రామకృష్ణ ఉన్నారు.
KNR: రామగుండం సింగరేణి సంస్థ GDK-1వ బొగ్గు గని ఆవరణలో ఇటీవల నిర్మించిన మీటింగ్ హాల్‌ను RG-1 GM లలిత్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. కార్మికులు విశ్రాంతి సమయంలో అధికారులకు మీటింగ్ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (AITUC) నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, అధికారులు రమేశ్, సురేశ్, నాయకులు సంకే అశోక్, తదితరులు పాల్గొన్నారు.
PDPL: జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ నియామకంలో భాగంగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొత్త నరసింహం DCC సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నరసింహం BRS హయాంలో ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.
KMM: కామేపల్లి మండలంలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత వేలం పాట శుక్రవారం మళ్లీ వాయిదా పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన కనీస మద్దతు ధర రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దారావత్ అనురాధ తెలిపారు. ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో వేలం ప్రక్రియ వాయిదా పడుతోందన్నారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
WGL: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్ డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని అన్నారు. కొనుగోలు చేయకపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి క్వింటాకు రూ.1600 నుంచి రూ.1900 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు.
BDK: రాబోయే గోదావరి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ డిప్యూటీ CM హామీ ఇచ్చారు. భద్రాచల రామాలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి రూ. 500 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
MBNR: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ MBNR కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 421 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NGKL: నాగర్‌కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో రెండు రోజుల క్రితం మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు శ్రీనివాస్ రెడ్డి మరణించడంతో ఇవాళ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: విద్యారంగానికి బడ్జెట్‌లో సరిపడ నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారన్నారని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగంలు ఆవేదన వ్యక్తం చేశారు. నార్కట్ పల్లిలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయించి విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు.
HNK: పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్ని వారికి తోఫాలను అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మైనారిటీలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు ఆయన ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్నారు.
WGL: మ్యాజిక్ బస్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన CKM కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, బీ -ఫాం, ఢీ – ఫాం పాస్ అయిన వారు హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: తాండూరు డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలు అందించాలని కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి RDO కర్ర అనితను కోరారు. శుక్రవారం RDOగా బాధ్యతలు చేపట్టిన అనితను శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాండూరు డివిజన్ గురించి చర్చించి డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలను అందించాలని అన్నారు.