• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

HYD: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నిజాంపేట్ మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పాల్గొన్నారు.

February 27, 2026 / 01:36 PM IST

ఇంటర్ పరీక్షకు 27 మంది గైర్హాజరు

VKB: కుల్కచర్ల మండలంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రామలింగేశ్వర డిగ్రీ కళాశాలలో 228 మంది విద్యార్థులకు గాను 222 మంది హాజరవ్వగా, 6గురు గైర్హాజరయ్యారు. అలాగే వివేకానంద జూనియర్ కళాశాలలో 294 మందికి గాను 274 మంది హాజరయ్యారని, 20 మంది విద్యార్థులు రాలేదని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 01:35 PM IST

వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దశమ వార్షికోత్సవ కళ్యాణానికి హాజరుకావాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం సభ్యులు కోరారు.

February 27, 2026 / 01:35 PM IST

ఎంఈవోపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

KMM: ముదిగొండ MEO రమణయ్యపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ముదిగొండ మండలం రాఘవపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై MEOను ప్రశ్నించారు. పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోతున్నారని చెప్పారు. తాను మళ్లీ వచ్చేనాటికి పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉండాలన్నారు.

February 27, 2026 / 01:35 PM IST

ఓటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థిని ఓదార్చిన ఎర్రబెల్లి

MHBD: తొర్రూరు మున్సిపాలలోని 6వ వార్డు నుండి కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందిన రాయిశెట్టి మానస యాకేందర్‌ను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమెకు మనోధైర్యం నింపుతూ.. మేమున్నాం, అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. భవిష్యత్తులో బలమైన మహిళ నాయకురాలుగా ముందుకు సాగాలని పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

February 27, 2026 / 01:35 PM IST

లారీ ఇంజన్‌లో చెలరేగిన మంటలు

RR: లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగిన ఘటన అంతారం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. SDNR నుంచి షాబాద్‌కు లారీ వెళుతుండగా అంతారం గేట్ వద్ద అకస్మాత్తుగా లారీఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన లారీ డ్రైవర్ రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 01:33 PM IST

ఎన్నికల హామీని నెరవేర్చిన సర్పంచ్..!

MDK: చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామానికి చెందిన మంగలి రామయ్య మృతి పట్ల సర్పంచ్ రాజేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, బాధిత కుటుంబానికి తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 01:32 PM IST

హార్ట్ ఆపరేషన్స్‌కు కేరాఫ్‌గా నిలవనున్న సనత్‌నగర్ టిమ్స్

HYD: సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్ర చికిత్సలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఇతర అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు.

February 27, 2026 / 01:31 PM IST

నిజామాబాద్ నుంచి ఢిల్లీకి బంజారా సోదరుల పయనం

NZB: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరగనున్నాయి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర జాదవ్ నేతృత్వంలో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి బంజారా సోదరులు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు.

February 27, 2026 / 01:30 PM IST

‘డ్రైవర్లు భద్రతా నియమాలు పాటించాలి’

SRCL: అందరం బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో వివిధ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలన్నారు. దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉంటే వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవాలన్నారు.

February 27, 2026 / 01:30 PM IST

​పల్లె దవాఖానకు తాళం.. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

SRPT: చివ్వేంల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో గల పల్లె దవాఖాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ఉదయం 9:18 గంటలైనా దవాఖానకు తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

February 27, 2026 / 01:30 PM IST

పరీక్షకు 244 మంది గైర్హాజరు

NRML: నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 244 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరశురాం తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు 6876 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6627 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

February 27, 2026 / 01:30 PM IST

మూత లేక దుర్వాసన.. ప్రజలు అనారోగ్యం బారిన

NLG: చిట్యాల పురపాలికలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోయారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

February 27, 2026 / 01:30 PM IST

జీహెచ్ఎంసీ డైరెక్టర్‌గా రామారెడ్డి వాసి

KMR: రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్ఈ అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లి హైదరాబాద్లో ఉన్నత పదవిని అధిష్ఠించడం పట్ల గ్రామస్థులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2026 / 01:30 PM IST

వేసవికి ముందే SC కాలనీలో తాగునీటి సమస్య

ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారంగా బోర్వెల్ ఏర్పాటు చేయాలని MLA హరీశ్ బాబును కోరారు.

February 27, 2026 / 01:29 PM IST