MDK: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆమెతోపాటు జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీఆర్ భుజంగ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని కైర్గాం జాతీయ రహదారిపై సోమవారం ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్య సహాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
SRCL: వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్మన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ.. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు. మున్సిపల్ మాలోత్ సంగీత తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19 నిర్వహించబడుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.2000 నగదు బహుమతి అందజేయబడుతుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMM: ఖమ్మం వెలుగుమట్లలోని పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చిన ఘటనలో నిరాశ్రయులైన పేదలకు న్యాయం చేయాలని సీపీఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
నల్గొండలోని అర్జాలబావిలో అరోరా లీగల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ట్రాన్స్‌జెండర్ హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ప్రకారం వారికి ఉన్న రక్షణలను, 2019 చట్టం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలను వివరించారు. స్మైల్ పథకం, ఆయుష్మాన్ భారత్, టీజీ ప్లస్ పథకాల గురించి వివరించారు.
MNCL: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజా నాట్యమండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. రాబోయే బడ్జెట్‌లో కళాకారులకు కొంత శాతం కేటాయించి, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల మాదిరి రిజర్వేషన్ కల్పించాలన్నారు.
KNR: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి 345 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
SDPT: దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ పరిధిలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, నీటి సమస్యపై చర్చించారు. ఈ కార్యక్రమంలో MLA కొత్త ప్రభాకర్ రెడ్డి, సభ్యులు ఫాల్గొన్నారు.
WNP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన 40 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.
JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి సేవలు మధ్యాహ్నం నుంచి రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ, ఆలయ పూజారి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి గుడిని మూసి వేస్తామన్నారు. తిరిగి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం, అర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయాన్నారు.
SRD: అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు లభిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు భాస్కర్ రిటైర్మెంట్ అభినందన సభ నేడు ఖేడ్‌లోని బసవ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హాజరై ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌కు శాలువ కప్పి సన్మానించారు.
RR: రేపు చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి గుడి మూసి వేయడం జరుగుతుందని, తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనాలు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
MDK: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహిమూద్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.