JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్పంచ్ పుల్లూరు ఉమాదేవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 30 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి ఆసుపత్రికి తరలించినట్లు లయన్స్ క్లబ్ సభ్యుడు అంగడి ఆనంద్ తెలిపారు.
ASF: జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని NHM JAC నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజకు వినతిపత్రం అందజేశారు. 78 కేడర్లలో సేవలందిస్తున్న తమను ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రమబద్ధీకరించారని, తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
SRPT: హరిత కోదాడ నర్సరీలతోనే సాధ్యం అవుతుందని, అధికారులు, సిబ్బంది నర్సరీల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తీసుకోవాలని కోదాడ తాజా మునిసిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు.
సిద్దిపేట: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని వీరన్నపేట గ్రామ పాలకవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
NGKL: ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నం బట్టివాడకు చెందిన తాటికొండ రవీందర్ అనే వ్యక్తి శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మృతుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్, సౌభాగ్యపురంలో అలివేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో రాజగోపుర ప్రతిష్ఠాపన మహోత్సవం, కుంభప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాత్సవానికి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
HYD: నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ 2026 స్పేస్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ ఎక్స్ పోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను, ఆవిష్కరణలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఓ రోబో ఆయనకు షేక్యాండ్ ఇచ్చి, స్వాగతం పలికింది. కిషన్ రెడ్డి వెంట పలువురు అధికారులు ఉన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం మృతి చెందారు. పని నిమిత్తం ఆర్మూర్ వచ్చిన ఆయన, స్వగ్రామం అర్గుల్‌కు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గంగారాన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతిని ధృవీకరించారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనవంతు చేయూతను అందించారు. ఆయన అన్నదాన కమిటీ సభ్యులకు రూ. 50,016 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4,748 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4668 మంది పరీక్ష రాశారు. 80 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
BDK: ఇల్లందు నియోజకవర్గంలోని సింగరేణి గ్రౌండ్లో శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ముగింపు సభ శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ చూపిన బాటలో నేటితరం నడవాలని సూచించారు. వారితో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కుమార్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్‌కు మెదక్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పట్టణంలోని పిట్లంబేస్‌కు చెందిన వ్యక్తి ఇంటిపై దాడికి యత్నించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనను ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. ఆయన విడుదలపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
JGL: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, సురక్షిత ప్రయాణాన్ని కల్పించే లక్ష్యంతో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శనివారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు.
NRML: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలోని కీర్తన అనే రెండేళ్ల పసి పాప కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పాపను హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో రత్నకల్యానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.