• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మృతిచెందిన రేషన్ డీలర్ కుటుంబానికి ఆర్థిక సాయం

KMR: తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ సీనియర్ రేషన్ డీలర్ పరందాములు అనారోగ్యంతో మృతి చెందారు. జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్, ప్రధాన కార్యదర్శి సంతోష్ రావు, గౌరవాధ్యక్షుడు లద్దూరి లక్ష్మీపతి యాదవ్, గౌరిశెట్టి రాజు తాడ్వాయి మండల రేషన్ డీలర్ల సమక్షంలో పరంధాముల కుటుంబ సభ్యులకు ఇవాళ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

February 26, 2026 / 03:17 PM IST

చర్లపల్లి పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లి సర్పంచ్ లక్ష్మమ్మ మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను గుర్తించి దాదాపు లక్ష యాభై వేల రూపాయలతో పనులను ప్రారంభించారు. భవిష్యత్తులో మెయిన్ లైన్ నుంచి గ్రామానికి నీరు సరఫరా సాఫీగా కొనసాగుతుందని తెలిపారు.

February 26, 2026 / 03:16 PM IST

క్రమశిక్షణ – రివిజన్‌తో విజయాన్ని సాధించాలి: పోన్నం

HYD: స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు భయం విడిచి ఆత్మవిశ్వాసంతో, సమయపాలనతో పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. క్రమశిక్షణ – రివిజన్‌తోనే విజయాన్ని సాధించాలన్నారు.

February 26, 2026 / 03:15 PM IST

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కళ్లల్లో ఆనందం

MBNR: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో ఎంతోమంది పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుడగ జంగం కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశానికి పాల్గొని ప్రారంభించారు. నేరుగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారికి డబ్బులు అకౌంట్లోనే జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

February 26, 2026 / 03:14 PM IST

కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

PDPL: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష గురువారం తెలిపారు. బీపీఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాలు గల వారు మరణిస్తే ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఇదివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం పొందని వారు అర్హులన్నారు.

February 26, 2026 / 03:13 PM IST

పంచాంగం చెప్పేందుకు వెళ్లి వచ్చేలోపు బైక్ చోరీ..!

VKB: శివరాంనగర్ కాలనీ దర్గా వద్ద ఒక పండితుడు తన హోండా షైన్ (TS34F9519) బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేసి పంచాంగం చెప్పడానికి లోపలికి వెళ్లారు. కొద్ది సేపటిలో బయటకు వచ్చి గమనిస్తే బైక్ దొంగిలించబడినది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికులను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

February 26, 2026 / 03:12 PM IST

యారోనిపల్లి రోడ్ మరమ్మత్తులు

MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ రాకమకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించనున్నాయి. సర్పంచ్ స్వాతి తిరుపతయ్య తన ఖర్చుతో 3 కిమీ మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేయించింది. బీటీ రోడ్ మంజూరుపై నాయకులు ఎప్పటికీ స్పందించకపోవడం ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

February 26, 2026 / 03:11 PM IST

బొడుప్పల్‌లో MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బొడుప్పల్ ప్రధాన రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డు పక్కన ఉండే చెత్త నిర్వహణపై సానిటేషన్ కార్మికులతో మాట్లాడి.. చెత్త లేకుండా, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. చెత్తా చెదారం లేకుండా చూడాలని, రోడ్లన్నీ స్వచ్ఛంగా కనబడలని సూచించారు.

February 26, 2026 / 03:05 PM IST

‘వార్డు సభ్యులు ప్రజలతో కలిసి పని చేయాలి’

MNCL: ప్రజలతో కలిసి వార్డు సభ్యులు పనిచేయాలని గ్రామాలలో జన్నారం, లక్షెట్టిపేట ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం కొనసాగింది. పలు చట్టాలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావాలంటే అందరూ కలిసి పని చేయాలన్నారు.

February 26, 2026 / 03:05 PM IST

రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలి: MLA

JN: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం, ఇతర అంశాలపై జనగామ కలెక్టరేట్లో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

February 26, 2026 / 03:03 PM IST

రూ. 5కే 20 లీటర్ల శుద్ధి చేసిన నీరు

KNR: చొప్పదండి మున్సిపాలిటీలో ప్రజలకు శుద్ధి చేసిన నీటిని 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ చొప్పున అందిస్తున్నట్లు చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ తెలిపారు. ఊరిలోని మంచినీళ్ల బావి నుంచి నీటిని సేకరించి, శుద్ధి చేసి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాయిన్ బాక్స్‌లో 5 రూపాయలు వేసి నీటిని పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు.

February 26, 2026 / 03:01 PM IST

369 మంది విద్యార్థులు గైర్హాజరు

ADB: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో జాదవ్ గణేష్ తెలిపారు. అయితే జిల్లాలో ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 03:00 PM IST

’70 బాటిళ్ల అక్రమ మద్యం సీజ్’

HYD: సికింద్రాబాద్ రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.79,230 విలువైన 70 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.

February 26, 2026 / 02:59 PM IST

‘ఉపాధి హామీ చట్టం పేరు యథావిధిగా కొనసాగించాలి’

NGKL: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్పును ఉపసంహరించుకొని యథావిధిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ డిమాండ్ చేశారు. అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్ల బావి, మల్కమామిడి, మన్ననూర్ గ్రామాలను సందర్శించి పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 02:59 PM IST

‘అగ్నిప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇల్లు’

NLG: గుడిపల్లి మండలం ఘనిపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తహసీల్దార్ మధుసుహాసిని, ఎంపీడీవో అండాలు, ఆర్ఐ సత్య రాజ్, సర్పంచ్ మల్లిక వెంకటేశ్వర్లు బాధితుడు భిక్షం కుటుంబాన్ని పరామర్శించారు.

February 26, 2026 / 02:57 PM IST