సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, సదాశిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 400 నిరుపేద కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఖలీల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. పేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ సహాయం అందించారు.
SRD: ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలో తాగునీటి పైప్లాన్ మరమ్మతు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే తమ లక్ష్యమని, నీటి సమస్య తలెత్తకుండా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ స్పష్టం చేశారు.
KMR: మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గంలో భక్తులు మహా పాదయాత్రగా వెళ్లారు. ఈరోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు.
MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్డు సమస్యపై “కోతకు గురైన రోడ్డు… స్పందించని అధికారులు..” అనే వార్త ఇటీవల HIT TV లో ప్రచురితమైంది. ఈ వార్తపై గ్రామ పాలకవర్గం స్పందించారు. సమస్యపై సమీక్షించి ఆదివారం పారిశ్యుద్ద సిబ్బందితో రోడ్డు కోతకు గురైన చోట గుంతలను పూడ్చివేశారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన గంగపుత్రులు ఆదివారం ధర్మపురి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 12, 14 తేదీల్లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. గ్రామంలో వేడుకల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచులు కటకం మల్లేశం, పాల్గొన్నారు.
MNCL: జీవిత బీమా ఏజెంట్ల అసోసియేషన్ కరీంనగర్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన సీనియర్ ఏజెంట్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: అల్వాల్ సర్కిల్ HMT ఆఫీసర్స్ కాలనీలోని బతుకమ్మ పార్క్‌లో ఆదివారం కాలనీ వాసులు వినూత్నంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కుండితో సహా ఒక మొక్కను కాలనీ కమిటీకి అందజేశారు. మాజీ అధ్యక్షుడు బలరాం గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు వికాస్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దర్శనీయ వేళలు ఇలా ఉన్నాయి. ఉ. 3 గంటలకు సుప్రభాతం, 3:30లకు తిరు ఆరాధన, బాల భోగం, ఆరగింపు, 4:30 నిజాభిషేకం, 5:15 సహస్రనామార్చన, 5:45 ఉభయ దర్శనాలు, 7:00 ఆలయం మూసివేత. 4వ తేదీన ఉదయం 3:00 ఆలయ సంప్రోక్షణ, 5:30 సుప్రభాతం, 6:00 ఆరగింపు, 7:30 నిజాభిషేకం, 8:15 అర్చన, 8:45 దర్శనాలు.
ADB: బోథ్ మండలం కన్గుట్టలో శబరిమాత 2వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన షెడ్డుకు ఆయన భూమిపూజ చేశారు. ఆధ్యాత్మికతతోనే సమాజంలో సేవాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.
JGL: ధర్మపురిలో మార్చి 3-5 వరకు తెప్పోత్సవం, డోలోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో బ్రహ్మ పుష్కరిణిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పూర్తిగా శుభ్రం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోనేరులో నీటిని మార్చి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
SRPT: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ కోరారు. ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ బంగారు ఆభరణాలు ధరించవద్దని, పిల్లలకు నగలు వేసి ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కి కాల్ చేయాలన్నారు.
NZB: మెండోరా మండలం సోన్ పేట్‌లో కాకతీయ కెనాల్ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయినట్లు సర్పంచ్ తోట నర్సవ్వ-మల్కయ్య తెలిపారు. మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌తో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
KMM: అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా ఏ ఎన్నిక వచ్చినా తీర్పు ‘వన్ సైడ్’గానే ఉందని, ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు.
NRML: భైంసా మండలం పాంగ్రి గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శివాజీ మహారాజ్ చరిత్ర యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ప్రజా ట్రస్ట్ ఛైర్మన్ మోహన్ రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.