• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత

KNR: పోగొట్టుకున్న మొబైల్‌ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 28న గంగాధర తిరుపతి అనే వ్యక్తి తన ఫోన్‌ను తీగలగుట్టపల్లిలో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని తిరుపతికి అందించారు.

March 2, 2026 / 04:17 PM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

MDK: నర్సాపూర్ డివిజన్ కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆర్డీవో రామకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష గదుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

March 2, 2026 / 04:17 PM IST

గ్రహణం ప్రభావం.. మాస కళ్యాణం రద్దు

NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై ఉన్న హరి-హర క్షేత్రమైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి, శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. 3న జరిగే పౌర్ణమి కళ్యాణం రద్దు చేయబడిందని, ఇది తిరిగి చైత్ర మాసంలో జరుగుతుందని ఛైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు.  

March 2, 2026 / 04:16 PM IST

రత్నవరంలో సైన్స్ దినోత్సవ వేడుకలు

SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడిగూడెం మండల శాఖ సౌజన్యంతో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 04:15 PM IST

డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్

RR: తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు, గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా, అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కలిసి పార్టీ పటిష్టత గురించి చర్చించారు.

March 2, 2026 / 04:13 PM IST

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: స్పీకర్

VKB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ డి.శ్రీపాదరావు సేవలు మరువలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు అందించిన ఉన్నతమైన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

March 2, 2026 / 04:12 PM IST

ఏపూర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

SRPT: ఆత్మకూరు ఎస్.మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా బాధ్యతలు చేపట్టి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయురాలిగా దడిగల శ్రీవర్ష, కలెక్టర్‌గా ఎల్లుట్ల అంజలి, డీఈవోగా కత్తుల శృతి, ఎంఈవోగా ఎరుకల విష్ణువర్ధన్ వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధ్యాపకులు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 04:11 PM IST

సమిష్టి కృషితో అభివృద్ధి: MLA

SRD: రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కృషిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన మంచి అంశాలపై దృష్టి సారించాలన్నారు.

March 2, 2026 / 04:07 PM IST

కర్తవ్యం వర్సెస్ కన్నీరు.. ఎస్సై భావోద్వేగ పోరాటం

KMM: సాధారణంగా ఖాకీ చొక్కా వెనుక కఠినత్వం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ యూనిఫామ్ వెనుక కూడా ఒక స్పందించే గుండె ఉంటుందని నిరూపించే దృశ్యం ఇది. ఒక మహిళ ఎంతో ఆవేదనతో తన గోడును వెళ్లగక్కుతుంటే, అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై ఆమె బాధను చూసి చలించిపోయారు. ‘మా చేతుల్లో ఏమీ లేదమ్మా’ అంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.

March 2, 2026 / 04:06 PM IST

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవో

JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్‌పల్లి డివిజన్ ఆర్డీవోగా నూతన బాధ్యతలు స్వీకరించిన జి. నరసింహరావు సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేయగా, కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

March 2, 2026 / 04:05 PM IST

VO భవన నిర్మాణానికి భూమి పూజ

NLG: చండూరు మండలం కోటయ్యగూడెంలో వీవో (VO) భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి దోహదపడే ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలెంక రాంబాబు, ఉపసర్పంచ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:05 PM IST

కాగజ్ నగర్‌లో శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి భిక్షాటన

ASF: కాగజ్ నగర్ పట్టణంలో శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా MLA హరీష్ బాబు కలిసి ఆయన ఆశీర్వాదలు తీసుకున్నారు. రామానుజ జీయర్ స్వామి మార్కెట్ ఏరియా గుండా వారు మిర్యాలగూడలో జరపనున్న మహాలక్ష్మి యాగ నిమిత్తం భిక్షాటన చేశారు. అనంతరం MLA కి స్వామి వారు మంగళ శాసనాలు అందజేశారు.

March 2, 2026 / 04:05 PM IST

పంచాయతీ కార్మికులకు యూనిఫామ్‌‌‌ల అందజేత

NRML: బండల్ ఖానాపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ కళ్యాణి సచిన్ కుమార్ జాదవ్ యూనిఫామ్‌లు అందజేశారు. గ్రామ పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొంటూ,ప్రజలు కూడా పరిశుభ్రత పరిరక్షణలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ ముత్యం, కార్యదర్శి అక్షిత, వార్డు సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:03 PM IST

ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు

NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 7 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం జరిగిన గణితం, రాజనీతి, వృక్షశాస్త్రం పరీక్షలకు మొత్తం 1,867 మందికి గాను 1,796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామ్ రెడ్డి తెలిపారు.

March 2, 2026 / 04:01 PM IST

సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్

MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు ఎదురుకుంటున్న అంగన్వాడీ టీచర్ వరలక్ష్మిపై సోమవారం సర్పంచ్ సింగతి రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమయపాలన పాటించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

March 2, 2026 / 04:01 PM IST