• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష

NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయపాలన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదల, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతుల పురోగతిపై చర్చించారు.

February 27, 2026 / 06:46 PM IST

​చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: హైదరాబాద్‌లోని మెడివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లి సర్పంచ్ రాంసింగ్ నాయక్ కుమార్తె గీతికను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించారు. ​ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కంట్లో కత్తెర గుచ్చుకోవడంతో గీతికకు ఆపరేషన్ జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

February 27, 2026 / 06:44 PM IST

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.!

MDK: రేగోడ్(మం) గజవాడలో విద్యుత్ షాక్ తగిలి కుమ్మరి వెంకయ్య(65) మృతి చెందారు. తన ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయారు. ఈ క్రమంలో తల వెనుక భాగానికి తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మేరకు ఎస్సై పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 06:44 PM IST

కాటమయ్య కిట్లను పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

JN: జిల్లా కేంద్రంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లను గౌడ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

February 27, 2026 / 06:42 PM IST

‘ఉద్యోగ నోటిఫికేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో గ్రంథాలయం నుంచి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతూ, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తుందని నాయకులు ఇంద్ర నాయక్ మండిపడ్డారు.

February 27, 2026 / 06:40 PM IST

కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన జిన్నారం పాలకవర్గం

SRD: జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్యకి జిన్నారం మున్సిపల్ సమస్యలపై ఛైర్మన్ జనార్ధన్ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రహదారులు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గం కలెక్టర్‌ను సన్మానించారు.

February 27, 2026 / 06:38 PM IST

బెజ్జంకిలో ఉచిత పశు వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి(మం) రాంసాగర్ గ్రామంలో గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఇంగాల లక్ష్మి–నాగమల్లేశం శిబిరాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యురాలు డాక్టర్ హరిత పాడి పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేశం రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 06:37 PM IST

సౌందర రాజన్ మృతదేహానికి మాజీ ఎంపీ నివాళులు

RR: చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర రాజన్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సౌందర రాజన్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి

February 27, 2026 / 06:37 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన.. నేత్ర పరీక్షలు నిర్వహణ

HNK: రోడ్డు ప్రమాద నివారణ కార్యక్రమంలో భాగంగా ఐనవోలు పోలీసులు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన పున్నేలు గ్రామ శివారులోని ఏకశిలా స్కూల్ సమీపంలో, నేషనల్ హైవే–563పై హెవీ వాహన డ్రైవర్లకు ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు.

February 27, 2026 / 06:37 PM IST

రాయికోడ్ 10వ వార్డులో ఎస్ఈడీ బల్బులు

నారాయణపేట: నర్వ మండలం రాయికోడ్ గ్రామం 10వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కొత్త ఎస్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పీ. శశికళ రవికుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీటిని అమర్చారు. రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎస్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.

February 27, 2026 / 06:36 PM IST

‘మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చాలి’

ASF: మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరుతూ MLC దండే విఠల్‌కు కాగజ్ నగర్‌లో శుక్రవారం ఆ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు, జిల్లా అధ్యక్షుడు వాసు, విజయ్ శ్రీనివాస్, వసంత్ పాల్గొన్నారు.

February 27, 2026 / 06:35 PM IST

‘విద్యార్థులు శిఖరాలు అధిరోహించాలి’

GDWL: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ కోరారు. గోర్లఖాన్ దొడ్డి పాఠశాల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల పైచదువుల ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 42 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు.

February 27, 2026 / 06:35 PM IST

దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్

NRML: ఖానాపూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గురిజాల నడిపి నరహరి, భూటా శంకర్, చీమల శ్రీకాంత్, బూర్క లక్ష్మణ్, గాదె రమేష్, దాసన్ల శ్రీనివాస్ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 06:34 PM IST

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సీఎం కప్ 2025 క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. జిల్లా నుంచి పాల్గొన్న 22 మంది క్రీడాకారులలో 4 బంగారు, 8 వెండి, 10 కంచు పథకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 27, 2026 / 06:34 PM IST

ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్‌గా నియామకం

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగ అధ్యాపకుని డాక్టర్ ఎస్. రవికుమార్‌ను ప్రజావాణి పిర్యాదుల నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.రమేష్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎస్. రవికుమార్‌ను పలువురు అభినందనలు తెలిపారు.

February 27, 2026 / 06:34 PM IST