BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు.
MDK: స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య స్వభావం, సరళ జీవనశైలి కలిగిన నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారన్నారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల యువజన అద్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక PHCలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
HYD: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.10 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బంజారాహిల్‌కు చెందిన ఓ వైద్యురాలు ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రకటన చూశారు. అనంతరం వాట్సాప్‌లలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. మొదటగా రూ.10,000 పెట్టిన బాధితురాలు లాభాలు రావడంతో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టింది. దీంతో నేరగాళ్లు అదును చూసి జండా ఎత్తేశారు.
VKB: కొండాపూర్ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రధానోపాధ్యా యుడు గోబ్ర్యా నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సహచర ఉపాధ్యాయుల కృషితో పాఠశాలకు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో జిల్లా స్థాయి అవార్డు వచ్చిందని తెలిపారు.
MHBD: గంగారం మండలం తిరుమలగండి గ్రామం నుంచి జాతీయస్థాయి క్రికెట్ ఎంపికైన కృష్ణవేణిని సోమవారం MPDO వైష్ణవి, సర్పంచ్ కృష్ణారావు, కార్యదర్శి గోపీచంద్, HM ఆనందరావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు కృష్ణవేణికి ఆర్థిక ప్రోత్సాహకంగా రూ. 7,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సెహగల్ కమ్యూనిటీ మొబైల్ (SM) కవిత, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
NLG: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఇంటింటికీ సాగర్ నీరు అందించడమే లక్ష్యంగా సర్పంచ్ ఆవుల సుందర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ పరిధిలోని పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించి, కొత్తగా 5 గేట్ వాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డుల్లో ప్రధాన పైప్‌లైన్లను సరిచేసి ఇవాళ నీటి సరఫరాను ప్రారంభించారు.
MBNR: జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్-100 లేదా 8712659360ను సంప్రదించాలని సూచించారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు రాత్రి 8 గంటలకు కామ దహన కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తెలిపారు. కామ దహన కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా 4వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని తెలిపారు.
ASF: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీ దారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు రమేశ్, అబ్దుల్ నబీ ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు నిర్వహణ, గదుల ఏర్పాటు, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఐషర్ 380 ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు సయ్యద్ కరీం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ను వెతికేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
BDK: అశ్వాపురం మండల పరిధిలో గల అతి పెద్ద గుట్ట అయిన తుమ్మల చెరువు, కుర్వపల్లి కొత్తూరు గుట్ట పట్టపగలే అగ్నికి ఆహుతి అవుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. సంబధిత శాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకుని పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని సోమవారం మండల ప్రజలు కోరారు. మూగ జీవాలు ఈ ప్రమాదాల వల్ల నష్టపోయే అవకాశ ఉందని తెలిపారు.
MNCL: మంచిర్యాల జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆధార్ కార్డు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
NGKL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 43 ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.