• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడాలి’

MNCL: బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు అన్నారు. ఆదివారం జన్నారంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 55 శాతం పైగా ఉన్న బీసీలు రిజర్వేషన్ల పెంపు కోరుకుంటున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.

March 1, 2026 / 05:18 PM IST

ప్రహరి నిర్మాణానికి భూమి పూజ

MDK: చేగుంట మండలం చిన్న శివునూరులో రూ. 10 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. సర్పంచ్ చుంచునకోట వరలక్ష్మి, ఉప సర్పంచ్, గ్రామ పాలక వర్గ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:17 PM IST

భూదాన్ బాధితులకు అండగా ఆమరణ న్యాయ దీక్ష

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా ఆదివారం తెలంగాణ బహుజన సంఘం నాయకులు రాజు ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమరణ న్యాయ దీక్ష చేపట్టారు. అత్యంత దారుణంగా జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చివేసి, మహిళలు అని చూడకుండా వారిపై దాడికి పాల్పడడం సరికాదన్నారు. జిల్లా మంత్రులు భూధాన్ బాధితులకు న్యాయం చేసే వరకు దీక్షను విరమించేది లేదని రాజు పేర్కొన్నారు.

March 1, 2026 / 05:16 PM IST

తాగునీటి సమస్యను తీర్చిన సర్పంచ్

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని ఐదో వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ ఆదివారం పాలెం పరిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ ఫేస్ ఏర్పాటు చేశారు. నీటి సమస్యను తీర్చినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బొడ్డుపల్లి అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:15 PM IST

కాల్పోల్‌లో అరైవ్-అలైవ్ కార్యక్రమం

NZB: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కాల్పోల్‌లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మోపాల్ పోలీసులు ఆదివారం నిర్వహించారు. SI సుస్మిత మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు హెల్మెట్ వాడకం సీట్ బెల్ట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవ్, కుల వివక్ష, నిర్మూలన గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ మొదలైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

March 1, 2026 / 05:14 PM IST

తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక అభ్యంతరకరం

SRD: తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక అభ్యంతరంగా ఉందని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి అన్నారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిషన్ నివేదిక ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి తుకారం, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీ పాల్ పాల్గొన్నారు.

March 1, 2026 / 05:13 PM IST

46 ఏళ్ల తర్వాత కలుసుకున్న పాఠశాల స్నేహితులు

SRPT: కోదాడ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ 1981-82 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయంగా సమావేశమయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం తాము చదివిన పాఠశాలకు వెళ్లి ఆనాటి గుర్తులను నెమరువేసుకున్నారు.

March 1, 2026 / 05:12 PM IST

నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం: కలెక్టర్

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, సకాలంలో సీఎంఆర్ ధాన్యం సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు వేగంగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నగదు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా జమ చేసేలా చూడాలని ఆయన తెలిపారు.

March 1, 2026 / 05:12 PM IST

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

WGL: చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి శనివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ప్రజా పాలనలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

March 1, 2026 / 05:12 PM IST

అభినందన సభలో పాల్గొన్న ఛైర్‌పర్సన్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్‌కు శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చెపడతానని తెలిపారు.

March 1, 2026 / 05:10 PM IST

బైంసాలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్

NRML: భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ ఇవాళ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో 12 బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేశారు. అలాగే మైనర్ పిల్లలకు అవగాహన కల్పించి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నారు.

March 1, 2026 / 05:06 PM IST

పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

KMR: లింగంపేట(M) శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఇంటర్ (ద్వితీయ) చదువుతున్న శివకుమార్(17) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SI దీపక్ తెలిపారు. ఇంటర్ పరీక్షలు బాగా రాయట్లేదని ఆందోళన చెంది, నిరాశకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు.

March 1, 2026 / 05:06 PM IST

‘పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య’

KMM: గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు. ‘ఇది ప్రజా ప్రభుత్వం కాదు..పేదల వ్యతిరేక ప్రభుత్వం’ అని అన్నారు.

March 1, 2026 / 05:05 PM IST

వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్‌పల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. కొండపాకగూడెం గ్రామంలో దాసరి గోపాల్ మనవరాలికి, అలాగే చిన్న నారాయణపురం గ్రామంలో బొబ్బలు సైదులు కుమార్తెకు నిర్వహించిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 1, 2026 / 05:02 PM IST

అంబేద్కర్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

JGL: జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో గల చైతన్య నగర్ అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా సుద్దాల గంగాధర్, ఉపాధ్యక్షునిగా బొల్లె రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుద్దాల విజేందర్, కోశాధికారులుగా బొల్లారపు దినేష్, ఉప్పరి సతీష్, నలువాల కిషోర్ ఎన్నికయ్యారు. సంఘ సభ్యులు దుబ్బయ్య, లక్ష్మణ్, సాయిలు, ప్రవీణ్, సాయి, మరంపల్లి రాజేశం, నారాయణ, రాజేందర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 05:01 PM IST