• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నారాయనగూడా-హిమాయత్‌నగర్ వైపు ట్రాఫిక్ జామ్

HYD: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ వైపు వాహనాల రాకపోకలు మందగించాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. వాహనదారులు ముందుగానే బయలుదేరి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

February 25, 2026 / 02:05 PM IST

వెలుగొండ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పర్యటన

AP: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లెకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారులతో కలిసి కెనాల్ వెంట నడిచి పరిశీలించారు. పనుల నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 01:52 PM IST

23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు బంగ్లా జట్టు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్ 2026-27 ఆసీస్ హోమ్ సీజన్‌కు ఆరంభం కానుంది. గతంలో 2017లో మీర్పూర్‌లో ఆసీస్‌ను ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తలపడనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 25, 2026 / 01:51 PM IST

‘పరీక్షల వేళ విద్యార్థులకు బైకు ఇవ్వొద్దు’

MDK: ఇంటర్మీడియట్ విద్యార్థుల భద్రత దృష్ట్యా పోలీసులు కీలక సూచనలు చేశారు. మైనర్లు, లైసెన్స్ లేని విద్యార్థులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 25, 2026 / 01:48 PM IST

‘శ్రీనివాస మంగాపురం’ క్రేజీ UPDATE

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు.

February 25, 2026 / 01:47 PM IST

ప్రతి నీటి బొట్టు ఒడిసి పడదాం: చమర్తి

అన్నమయ్య: రాజంపేట మన్నూరు చెరువు వద్ద బుధవారం జరిగిన గంగ హారతి కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని విమర్శించారు.

February 25, 2026 / 01:46 PM IST

చిన్నారి హత్య.. MRO ఏమన్నారంటే?

TPT: ఏర్పేడు మండలంలో రెండున్నరేళ్ల బాలికను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తహసీల్దార్ భార్గవి తెలిపారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి నిందితుడు చూపించిన స్థలానికి వెళ్లి తవ్వకాలు చేశామన్నారు. బాలిక మృతదేహం బయటపడిందని.. మెడికల్ అధికారుల సమక్షంలో పంచానామా పూర్తి చేశామని తెలిపారు.

February 25, 2026 / 01:46 PM IST

డయేరియా వ్యాప్తి.. కమిషనర్‌పై వేటు

AP: శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా కూర్మారావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నగరంలో డయేరియా ప్రబలడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారుల నివేదికలో తేలింది. పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరాలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిగా చేస్తూ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

February 25, 2026 / 01:45 PM IST

జగన్‌కు సమాధానం ఎందుకు చెప్పాలి?: లోకేష్

AP: VSR ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కు లావాదేవీలు లేవని, 2022లో తమ దగ్గర ఆ సంస్థ ఫైనాన్స్ తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని కానీ, తమ ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని కలగన్నామా అని చెప్పారు. జగన్ ఆరోపణలకు తామెందుకు సమాధానం చెప్పాలన్నారు.

February 25, 2026 / 01:45 PM IST

నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షుడు

WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని రామతీర్థం GP చెందిన మేరుగు నవ్య సతీష్ నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 01:43 PM IST

ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు

భారతదేశంలోని 36 ప్రధాన నగరాల్లో ఈ ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నిర్మలమైన ఆకాశం, తేమ తగ్గడం, పశ్చిమ అవాంతరాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ముందస్తు వేసవి సంకేతమని IMD హెచ్చరిస్తోంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

February 25, 2026 / 01:40 PM IST

‘విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి’

MBNR: విద్యార్థులు రీల్స్ పై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతతో మెలగాలన్నారు.

February 25, 2026 / 01:38 PM IST

గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ దాసరి కళ్యాణ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఇద్దరినీ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

February 25, 2026 / 01:37 PM IST

నేటి చిరుధాన్యాల ధరలు ఇలా

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ ధర రూ.5200, క్వింటాల్ సూక పల్లికాయ ధర రూ. 10300, క్వింటాల్ మక్కలు (బిల్టి) ధర రూ.1905, క్వింటాల్ పసుపు ధర రూ.12000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 01:37 PM IST

HYDలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ స్టూడియో

టాలీవుడ్‌లో సాంకేతిక విప్లవం మొదలైంది. హాలీవుడ్ స్థాయి ‘మోషన్ క్యాప్చర్’ టెక్నాలజీ ఇప్పుడు HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రాజమౌళి తాజాగా ఈ ‘M&M Cap’ ల్యాబ్‌ను ప్రారంభించాడు. మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఇకపై విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడే అవసరం ఉండదని సినీ వర్గా...

February 25, 2026 / 01:37 PM IST