• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో రేపే ప్రవేశ పరీక్షలు..!

W.G: నరసాపురం (M) ఎల్బిచర్ల బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. శ్యాంప్రసాద్ తెలిపారు. గురుకుల పాఠశాలలో ఆదివారం ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

February 28, 2026 / 12:32 PM IST

గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవన పనులను కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 28, 2026 / 12:32 PM IST

చర్మ సౌందర్యానికి శనగపిండి

చర్మ సౌందర్యానికి శనగపిండి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి రాస్తే అధిక జిడ్డు తగ్గుతుంది. లేదా శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలిపి ప్యాక్‌లా వేస్తే చర్మం మెరుస్తుంది. అంతేకాదు శనగపిండిలో నిమ్మరసంతో కలిపి వాడితే ట్యాన్ తొలగిపోతుంది.

February 28, 2026 / 12:32 PM IST

రాజ్యసభ సీట కోసం వీహెచ్ మంతనాలు

TG: ఢిల్లీలో నాలుగు రోజులుగా మాజీ ఎంపీ వీహెచ్ మకాం వేశారు. రాజ్యసభ సీటు కోసం అధిష్ఠానం పెద్దలను వీహెచ్ కలుస్తున్నారు. ఖర్గేను కలిసి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని వీహెచ్ కోరారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు. పనిచేసే వారికే అవకాశం ఇస్తామని సీఎం అంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు.

February 28, 2026 / 12:31 PM IST

రాజ్యసభ సీటు కోసం వీహెచ్ మంతనాలు

TG: ఢిల్లీలో నాలుగు రోజులుగా మాజీ ఎంపీ వీహెచ్ మకాం వేశారు. రాజ్యసభ సీటు కోసం అధిష్ఠానం పెద్దలను వీహెచ్ కలుస్తున్నారు. ఖర్గేను కలిసి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని వీహెచ్ కోరారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు. పనిచేసే వారికే అవకాశం ఇస్తామని సీఎం అంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు.

February 28, 2026 / 12:31 PM IST

రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

KMR: రేషన్ దుకాణాల ద్వారా రేపట్టి నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు భిక్నూ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్లు నిర్ణీత సమయానికి దుకాణాలను తెరిచి ఉంచాలని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపిణీ వివరాలను లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని కోరారు.

February 28, 2026 / 12:30 PM IST

స్వయంగా పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 12:30 PM IST

‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి’

VZM: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని వేపాడ ఎంఈవో పీ బాల భాస్కరరావు కోరారు. దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 12:30 PM IST

కలెక్టర్‌ను కలిసిన పీఎం శ్రీ నోడల్ అధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్ కుమార్ జిల్లా సమీకృత సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో పీఎంశ్రీ కింద అమలు అవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ జిల్లాకు వచ్చారు.

February 28, 2026 / 12:30 PM IST

కోవూరులో ప్రసన్న విజయం ఖాయం: కాకాణి

NLR: కోవూరు నియోజకవర్గంలో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబం మంచి పేరు సంపాదించుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని YCP జిల్లా అధ్యక్షులు కాకాణి పేర్కొన్నారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద డబ్బు సంచులు లేకపోయినా, కాని జన బలం ఉందన్నారు.

February 28, 2026 / 12:27 PM IST

ఉద్యోగులకు యూపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ గుడ్‌న్యూస్ చెప్పారు. హోలీ పండగను పురస్కరించుకుని ఫిబ్రవరి నెల వేతనాలను గడువు కంటే ముందే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. MAR 4న హోలీ పండగ చేసుకుంటున్న నేపథ్యంలో పండగ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవాళే జీతాలు జమచేయాలని సీఎం యోగి ఉత్తర్వులు జారీ చేశారు.

February 28, 2026 / 12:26 PM IST

కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలే: MLA

KDP: కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం ఎస్.తిమ్మాపురం గ్రామంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 12:25 PM IST

‘ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం’

TG: గోదావరి పుష్కరాల నిర్వహణపై ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం అని డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘మేం కాళేశ్వరంలో చాలా గొప్పగా చేయాలనుకుంటున్నాం’ అని భట్టి చెప్పగా ఆనం.. ఈ పుష్కరాల గురించి తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒకసారి మాట్లాడి, సమన్వయం చేసుకోవాలని CM చంద్రబాబు సూచించారని చెప్పారన్నారు.

February 28, 2026 / 12:25 PM IST

బెల్లంపల్లిలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

MNCL: బెల్లంపల్లి పట్టణంలో విలియన్స్ హో సంస్కారణార్ధం టైలర్స్ & వర్కర్స్ అసోసియేషన్, మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు కీర్తి రాము మాట్లాడుతూ.. టైలర్స్ డే కుట్టు కళకు గౌరవం తెలిపే రోజు అన్నారు. దర్జీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా ప్రత్యేక శ్రద్ద వహించి, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.

February 28, 2026 / 12:23 PM IST

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NDL: డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కర్ణాటక కు చెందిన ప్రమోద్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కర్నూలు మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఆసుపత్రికి పెళ్లి బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రమోద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

February 28, 2026 / 12:23 PM IST