హీరో నిఖిల్ తన అప్‌కమింగ్ ప్రాజెక్టులపై క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘స్వయంభు’తో పాటు, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ-3’ కూడా లైన్‌లో ఉందని చెప్పి అభిమానుల్లో...
MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం యావపూర్ సర్పంచ్ యంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు చీపుర్లు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని సర్పంచ్ స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
JGL: జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో ట్రాక్టర్లకే పరిమితమైన ఈ దందా,ఇప్పుడు లారీలు, టిప్పర్లలో బహిరంగంగానే సాగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రకృతి సంపదను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.తనిఖీల్లో వాహనాలు పట్టుబడుతున్నా అక్రమార్కుల తీరు మారడం లేదని, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నరు.
SRD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌కు జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
KMM: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాము, వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు.
AP: న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ‘అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతోనే ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు. అలాగే కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చేలా చేయాలి’ అని సూచించారు.
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పర్యావరణ స్పృహ పెరుగుతున్న వేళ, ఇప్పుడు జనపనారతో చేసిన పెళ్లిపత్రికలు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. కరీంనగర్‌లో నేషనల్ జూట్ బోర్డు ప్రదర్శించిన జూట్ పెళ్లిపత్రిక అందరినీ ఆకట్టుకుంది. చూడటానికి మహిళల హ్యాండ్‌బ్యాగ్‌లా ఉండి, తెరిస్తే పెళ్లిపత్రికగా కనిపించే ఈ వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
శ్రీకాకుళం: నరసన్నపేటలోని కలివరపుపేటలో రేషన్ డిపోను రాష్ట్ర కూరాకుల, పొందర కార్పొరేషన్ అధ్యక్షులు దామోదర నరసింహులు ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రేషన్ డిపో డీలర్‌గా పనిచేసిన చక్రవర్తి రెండు నెలల క్రిందట మృతి చెందడంతో ఖాళీ ఏర్పడిందన్నారు. దీంతో లక్కోజు స్వప్నకు రేషన్ డిపో అప్పగించింది.
SKLM: శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పిలి వీధి, చిన్న బజార్, మేధర వీధి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విస్తృతంగా ఆదివారం పర్యటించారు. వార్డుల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల శుభ్రపరిచే పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
NRPT: జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 65.03 శాతం పూర్తయ్యింది. మొత్తం 1,84,713 మంది పట్టాదారుల్లో 1,20,120 మంది ఇప్పటికే నమోదు చేసుకోగా, ఇంకా 64,593 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,59,000 ఎకరాల భూమి ఉండగా, అందులో 4,25,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగులో నిమ్స్ హాస్పిటల్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు, మల్లెల మడుగుమడుగు సర్పంచ్ మచ్చా నరసింహారావు ప్రారంభించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారితోపాటు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి ఉన్నారు.
MHBD: మరిపెడ మండలం నీలికుర్తి శివారు భజన తండాలో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే దారిని సత్తిరెడ్డి అనే భూస్వామి అక్రమించారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దారికి అడ్డంగా కందకం తవ్వి రైతుల రాకపోకలను నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారం స్పందించాలన్నారు.
ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9052548047, 8008949107 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిదని సూచించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇరాన్ కూడా అమెరికాపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ATP: జిల్లాలో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. ఆదివారం ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.