• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దేవాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే విరాళం

KRNL: దేవనకొండ మండలం కరివేములలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ రూ.20వేల విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సేవాభావాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 12:50 PM IST

జిల్లాలో ముందుగానే పింఛన్ల పంపిణీ

కడప జిల్లా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పింఛన్ లభించని వారికి మరల మార్చి 2వతేదీన పంపిణీ చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2,80,808 మంది లబ్దిదారులకు రూ.122,43,81,500ల నిధులు ఇప్పటికే తొమ్మిది రకాల బ్యాంకుల్లో జమ చేశారు అని డీఆర్డీయే పీడీ జి.రాజ్యలక్ష్మి వెల్లడించారు.

February 26, 2026 / 12:50 PM IST

బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల్లో మాజీ MLA బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జిల్లా ప్రధాన న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా బాల్క సుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు.

February 26, 2026 / 12:49 PM IST

అనంతగిరికి బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని డిమాండ్

SRPT: అనంతగిరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో ఇఫ్కో ఆర్థిక సహాయంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అనంతగిరికి బస్సు సర్వీసులు ప్రారంభించి, ఈ షెల్టర్‌ను వినియోగంలోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 12:47 PM IST

గాంధీ పేరు చెప్పి దోచుకుంటున్నారు: ఎంపీ కొండా

TG: మూసీ శుభ్రం చేయాలంటే ముందుగా నాలాలు క్లీన్ చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లోన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గాంధీ పేరు చెప్పి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 12:46 PM IST

ఈద్గాను పరిశీలించిన కేఎల్ఆర్

RR: రంజాన్ నమాజ్‌కు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ దర్గా దగ్గర ఉన్న ఈద్గాను ఈరోజు పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయాలని, నమాజ్‌కు వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

February 26, 2026 / 12:45 PM IST

నగరాభివృద్ధికి శాఖల సమన్వయం అవసరం

MBNR: నూతనంగా ఎన్నికైన మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుముల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గురువారం జిల్లా ఎస్పీ జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో పరస్పర సహకారంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

February 26, 2026 / 12:44 PM IST

మార్కాపురంలో అంగన్వాడి కార్యకర్తల ధర్నా

ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కాపురంలో R&B కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2సం. లు గడిచిన తమ సమస్యను పట్టించుకోలేదని, గర్భిణీ దశ నుండి చిన్నారుల పాఠశాలకు వెళ్లే వరకు సేవలందిస్తున్నామన్నారు.

February 26, 2026 / 12:43 PM IST

ప్రశాంతంగా ద్వితీయ సంవత్సరం పరీక్ష

NRML: జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షకు 83 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6219 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6036 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వారు తెలిపారు.

February 26, 2026 / 12:43 PM IST

‘విష్ణు విన్యాసం’ రన్ టైం ఎంతంటే..?

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. FEB 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. ఈ మూవీ 1:59 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.

February 26, 2026 / 12:42 PM IST

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించండి: బల్లా పల్లవి

ATP: అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ఉడిపి హోటల్‌ను మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి గురువారం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆమె రిబ్బన్ కట్ చేసి ఈ నూతన సంస్థను ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులకు సూచించారు.

February 26, 2026 / 12:41 PM IST

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

ADB: జిల్లాలోని కోర్టుల్లో మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్, మోటార్ ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 12:41 PM IST

రోడ్డు ధ్వంసం..ఇబ్బందులు పడుతున్నా వాహనదారులు

KMR: జిల్లా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామం నుంచి కొడిచిర గ్రామానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డును గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేయడంతో రోడ్డు ధ్వంసం అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

February 26, 2026 / 12:40 PM IST

‘ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’

KMR: తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ రాజా గౌడ్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ సెలవులో ఉండటంతో, పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగకుండా సర్పంచ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. సిబ్బందితో కలిసి వీధుల్లోని చెత్తను తొలగింపజేశారు. పదవిలో ఉండి పని చేసిన సర్పంచ్ చొరవను గ్రామస్థులు కొనియాడారు.

February 26, 2026 / 12:40 PM IST

పాల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

KDP: బద్వేల్ పరిధిలో కొనసాగుతున్న పాల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసింహ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకో మిల్క్ అనలైజర్ మీటర్ ద్వారా రీడింగ్ చెక్ చేసుకుంటూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మంచి సేవలు అందిస్తున్న పాల కేంద్ర యజమాని శ్రీ లక్ష్మయ్యను అభినందించి, సన్మానించారు.

February 26, 2026 / 12:40 PM IST