ADB: కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుషను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు గజేందర్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
T20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు భారత్‌కు స్వల్పంగా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు T20 WCలో మొత్తం 5 సార్లు తలపడగా.. భారత్ 3 సార్లు, ఇంగ్లండ్ 2 సార్లు విజయం సాధించాయి. వాంఖడే స్టేడియంలో ఈ జట్లు టీ20ల్లో రెండుసార్లు తలపడగా, చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.
BDK: కొత్తగూడెం పట్టణంలో నూతన బురఖా అండ్ ఫాన్సీ స్టోర్ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగూడెంలో మొట్ట మొదటి సారిగ బురఖా హౌస్ స్థాపించి బాంబే నుంచి దిగుమతి చేసి హోల్ సేల్ ధరలకే కొత్తగూడెం ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చిన అబ్దుల్ రషీద్‌ను అభినందించారు.
VZM: జిల్లాలోని పలు బాణాసంచా తయారీ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ఉమ్మడి తనిఖీలు నిర్వహించింది. బాడంగి, గుర్ల, చీపురుపల్లిలో ఈ తనిఖీలు జరిగాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్, ఎక్స్‌ప్లోజివ్ కంట్రోలర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
ELR: రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. హనుమాన్ నగర్ వంతెన వద్ద పట్టాలు దాటుతున్న కుప్పాల లీలా కుమార్ (45)ను రైలు ఢీకొంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. రైల్వే ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
NRPT: ఊట్కూర్ మండల మొగ్ధంపూర్ గ్రామంలోని శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన 14వ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాప్రసాదం పంపిణీ చేయగా.. గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
NRPT: కృష్ణ మండలంలోని హిందూపూర్ నుంచి మాగనూర్ మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో దెబ్బతింది. కల్వర్టు శిథిలం కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం రాకపోవడంతో ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
MDK: ఏడుపాయలలో పౌర్ణమిని పురస్కరించుకొని నేడు రాత్రి వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకుంది.
ఇరాన్ నిఘా శాఖలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందారు. ఆ ఇద్దరు అధికారులను తామే చంపినట్లు ఇజ్రాయెల్ రక్షణదళాల ట్వీట్ చేశాయి. నిఘా శాఖ సహాయమంత్రి సయ్యద్ యాహ్యా హమీద్, ఇరాన్ గూఢాచర్య విభాగ అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి చెందారు. కాగా, ఇజ్రాయెల్ ఇలాంటి రహస్య ఆపరేషన్లపై మౌనంగా ఉంటుంది. కానీ ఈసారి బహిరంగంగా ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
E.G: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ చొరవతో కీలక మౌలిక సదుపాయాల పనులకు మోక్షం లభించింది. యర్రాయిచెరువు – పిట్టల వేమవరం వరకు నిర్మించ తలపెట్టిన 1.1 కి.మీ సీసీ రోడ్డుకు కూటమి ప్రభుత్వం రూ.1.30 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు.
ADB: హోలీ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడారు. హోలీ పండుగకు డీజే అనుమతి లేదన్నారు. యువత, పిల్లలు వాగులు, చెరువులలో స్నానాలకు వెళ్లరాదని సూచించారు.
BDK: కొత్తగూడెం జిల్లా IDOC కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో సమస్య పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్,అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
MHBD: కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా సెల్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటైనా సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షణలో ఉన్న ప్రజలకు నేడు సిగ్నల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక పై ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు సాఫీగా ఉంటాయని విద్యార్థులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
VSP: యువతకు స్ఫూర్తినిస్తూ భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖ చేరుకుంది. దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు ద్వారా సమాజ సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పరుగు ద్వారా ఉదయాన్ ఫౌండేషన్ కోసం రూ.60 లక్షలు సేకరించనున్నట్లు చెప్పారు.