NRPT: జిల్లాలోని బోయిన్ పల్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్ మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ నంది అవార్డు అందుకున్నారు. అవార్డును అంబిక దర్బార్ బత్తి ఛైర్మన్ అంబిక క్రిష్ణ, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఛైర్మన్ శిరీష రెడ్డి, సినీ నటుడు బాబు మోహన్ వెంకటేష్ ప్రదానం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. నంది అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
WGL: పర్వతగిరి మండలం కొంకపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ఘటనపై ఉపాధ్యాయుడు వెంకట్రామ్ నరసయ్యను సస్పెండ్ చేశారు. ఐదుగురు విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో ఒక విద్యార్థికి రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ ఘటనపై ఎంఈవో బిక్షపతి మెమో జారీ చేసి విచారణ చేపట్టగా,నివేదిక ఆధారంగా సోమవారం డీఈఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
CTR: తవణంపల్లె మండలంలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఈవో మునిశేఖర్, ఛైర్మన్ రఘుపతి తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసి, రాత్రి 8 గంటలకు తిరిగి తెరిచి, 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.
CTR: తవణంపల్లె మండలంలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఈవో మునిశేఖర్, ఛైర్మన్ రఘుపతి తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసి, రాత్రి 8 గంటలకు తిరిగి తెరిచి, 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.
SRD: శిశు గృహాల్లోని చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డిలోని శిశు గృహాన్ని సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి పాల్గొన్నారు.
ASR: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. నిన్న ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. స్వయం ఉపాధి రుణాలతో గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.
జగిత్యాల: జిల్లా ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత,స్నేహభావం పెంపొందించే పండుగ హోలీ అని పేర్కొన్నారు.ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.హానికర రసాయన రంగులు వాడకుండా సహజమైన రంగులతో వేడుకలు నిర్వహించాలన్నారు. నీటి వృథాను నివారిస్తూ,భద్రతా నియమాలు పాటించాలని, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం SI విద్యాశ్రీ తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NGKL: కోడేరు మండలం జనంపల్లిలోని మంత్రాలమ్మ దేవస్థానం వేదికగా, ‘కేసరి కళావేదిక’ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ ‘సత్యహరిశ్చంద్ర’ పద్య నాటక ప్రదర్శనను నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు తగిలి వెంకటపతి ఓ ప్రకటనలో తెలిపారు. నాటక ప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.
VSP: విశాఖ భవిష్యత్తుకు కీలకంగా మారుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నిర్మాణంతో పాటు అక్కడికి చేరుకునే అనుసంధాన రహదారుల అభివృద్ధిపైనా సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులతో సమావేశమైన ఆయన, రహదారి పనులు గడువులోగా పూర్తి కావాలని ఆదేశించారు.
WGL: జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోలీ పండుగ స్నేహం, సామరస్యం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని, ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని సూచించారు.
JGL: మెట్పల్లి మండలం పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇల్లెందుల దివ్య (34) అనే వివాహిత తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
RR: చంద్రగ్రహణం సందర్భంగా నేడు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివే యనున్నట్లు ఆలయ అర్చ కులు తెలిపారు. ఇవాళ ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. భక్తులకు దర్శన అవకాశం ఉండదన్నారు.
KDP: ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో గతనెల 27న జరిగిన లారీ డ్రైవర్ షేక్ మొహమ్మద్ హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల బాకీ విషయమై జరిగిన గొడవలో దాడి చేయడంతో గాయపడిన మొహమ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
KKD: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు గుర్తింపు, గౌరవంతో పాటు బీమా రక్షణ కూడా అందిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.