• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలు

KDP: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, కనీస వేతనాల పెంపు వంటి డిమాండ్లపై చర్చించేందుకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలు మార్చి 16, 17, 18 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.హోచిమిన్ భవన్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన సందర్భంగా కార్మికులను పెద్దఎత్తున పాల్గొన్నారు.

March 1, 2026 / 05:09 PM IST

స్వర్ణామృత ప్రాసనం మందుల పంపిణీ

KRNL: ఆదోనిలో ఆవోపా, వామ్, వాసవి క్లబ్, ఐఐఎఫ్, ఐవీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ 22వ విడత “స్వర్ణామృత ప్రాసనం” మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో 219 మంది చిన్నారులకు రోగనిరోధక మందులు అందజేశారు. ఈ సందర్భంగా వంకదారు శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ మందు పిల్లల ఆరోగ్యం, మేధాశక్తి పెంపుకు దోహదపడుతుందని తెలిపారు.

March 1, 2026 / 05:07 PM IST

CMRF ద్వారా రూ.85,000 చెక్కు పంపిణీ

CTR: సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 85,000 చెక్కుని బాధిత కుటుంబానికి అందించినట్లు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ తెలిపారు. పుంగనూరు పట్టణం కట్ట కింద పాల్యానికి చెందిన మనీ మొదలియార్ సతీమణి ఇందిరాకు CMRF చెక్కును ఆదివారం అందజేశారు. బాధితుల ఆత్మస్థైర్యం పెరగాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 05:06 PM IST

బైంసాలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్

NRML: భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ ఇవాళ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో 12 బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేశారు. అలాగే మైనర్ పిల్లలకు అవగాహన కల్పించి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నారు.

March 1, 2026 / 05:06 PM IST

‘అసమర్ధతకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేయాలి’

KRNL: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు 9 ఏళ్లుగా పూర్తికాక నంద్యాల జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. తక్షణమే గండి పూర్చాలని డిమాండ్ చేస్తూ.. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. అసమర్ధతకు బాధ్యులైన జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 05:06 PM IST

పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

KMR: లింగంపేట(M) శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఇంటర్ (ద్వితీయ) చదువుతున్న శివకుమార్(17) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SI దీపక్ తెలిపారు. ఇంటర్ పరీక్షలు బాగా రాయట్లేదని ఆందోళన చెంది, నిరాశకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు.

March 1, 2026 / 05:06 PM IST

‘పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య’

KMM: గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు. ‘ఇది ప్రజా ప్రభుత్వం కాదు..పేదల వ్యతిరేక ప్రభుత్వం’ అని అన్నారు.

March 1, 2026 / 05:05 PM IST

1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ 1100 కాల్ సెంటర్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అన్నారు. అలాగే రేపు ఉ.9 నుంచి మ.1 గంట వరకు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.

March 1, 2026 / 05:05 PM IST

రేపు నూజివీడులో PGRS ప్రోగ్రాం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం అగ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

March 1, 2026 / 05:05 PM IST

IND vs WI: టాస్ గెలిస్తే భారత్ ఏం చేయాలి?

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో టాస్ అత్యంత కీలకం కానుంది. మరి టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో ఏది ఎంచుకుంటే మంచిదో కామెంట్ చేయండి.

March 1, 2026 / 05:03 PM IST

‘ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

ELR: కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU ఉమ్మడి ప.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడిలో ఆదివారం జరిగిన ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డులోని పథకాలను మరింత పెంచి, అర్హులైన కార్మికులందరికీ వర్తింపజేయాలన్నారు.

March 1, 2026 / 05:02 PM IST

వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్‌పల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. కొండపాకగూడెం గ్రామంలో దాసరి గోపాల్ మనవరాలికి, అలాగే చిన్న నారాయణపురం గ్రామంలో బొబ్బలు సైదులు కుమార్తెకు నిర్వహించిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 1, 2026 / 05:02 PM IST

అంబేద్కర్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

JGL: జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో గల చైతన్య నగర్ అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా సుద్దాల గంగాధర్, ఉపాధ్యక్షునిగా బొల్లె రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుద్దాల విజేందర్, కోశాధికారులుగా బొల్లారపు దినేష్, ఉప్పరి సతీష్, నలువాల కిషోర్ ఎన్నికయ్యారు. సంఘ సభ్యులు దుబ్బయ్య, లక్ష్మణ్, సాయిలు, ప్రవీణ్, సాయి, మరంపల్లి రాజేశం, నారాయణ, రాజేందర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 05:01 PM IST

కన్నెపల్లి వాడలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా

ASF: కౌటాల మండలం పాత కన్నెపల్లి వాడలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ మోర్లే పార్వతి పరిష్కరించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు ఆదివారం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆమె తెలిపారు.

March 1, 2026 / 05:01 PM IST

వైభవంగా శ్రీ వీరన్న భద్రకాళిస్వామి బ్రహ్మోత్సవాలు

BHNG: రామస్వామి తండాలో శ్రీ వీరన్న భద్రకాళి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ దిరావత్ సునీత వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సమీప గ్రామాల సర్పంచులు తిరుమణి నాగరాజుగౌడ్, చెలివేరు పావని ఇంద్రసేనారెడ్డి, మాజీ MPTC మచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 1, 2026 / 05:00 PM IST