TG: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమవ్వడంతో కాసేపట్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
NDL: భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు తెచ్చింది TDPనే అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై మండలిలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని YCP ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని TDP ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందన్నారు.
SRD: కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్యకు పదోన్నతి లభించింది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈయనకు డిప్యూటీ సీఈఓగా ప్రమోషన్ కల్పిస్తూ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డిలో సీఈవో జానకి రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనకు పదోన్నతికి CEO అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.
WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభునగర్ కాలనీలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా, చెత్తతో నిండి ఉన్న పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బావి దుస్థితి మున్సిపల్ ఛైర్మన్ శ్రీలక్ష్మీ రామానంద్ దృష్టికి రాగానే ఆమె వెంటనే స్పందించారు. బావిని పూర్తిగా శుభ్రం చేయించి, అందులోకి చెత్తాచెదారం పడకుండా పటిష్ఠమైన జాలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు కర్రీ, ఆలుగడ్డ, టమాట కర్రీలను పరిశీలించారు. బిర్యానీ అన్నం నాణ్యత సరిగా లేదని బిర్యానీలో బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
W.G. నరసాపురం మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదు రాజుని నరసాపురంలో బుధవారం మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కలిశారు. తాజాగా మేక శేషుబాబుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.
AKP: మాడుగులలో అగ్నిమాపక అధికారి వీ. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిని నియంత్రించడం, తమతో పాటు ఇతరులను రక్షించడంపై డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం చెస్ నెట్‌వర్క గ్లోబల్ ఆధ్వర్యంలో MEO మామునూరు శ్రీధర్ విద్యార్థులకు 126 చెస్ బోర్డులు, కాయిన్లు ట్రైనింగ్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ.. దాతల సహకారం మరువలేనిదని, విద్యార్థుల్లో చెస్ ఆట పట్ల ఆసక్తి పెరిగి తర్కశక్తి, ఏకాగ్రత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ELR: పెదవేగి(మం) దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు. అసంపూర్తిగా ఉన్న 32 భవనాలను పూర్తి చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభలో వివరించారు.
HYD: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతి బాధాకరం అని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
NZB: డిచ్‌పల్లి మండలం కమలాపూర్లో సర్పంచ్ ఋత్విజా రత్నం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నోల్ల సుజాత భూపతి, పంచాయతీ సిబ్బంది కొప్పెర రాకేశ్, సిర్నాపల్లి గంగాధర్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
VZM: శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో, అత్యాధునిక వస్త్ర శ్రేణిని, నగలను ఒకే చోట అందించేందుకు ఇలాంటి మాల్స్ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ ఛైర్ పర్సన్‌గా జూలకంటి శ్వేతా పాండురంగరెడ్డి మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ అభిరుద్దికి తమ సహకారం అందచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.