• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోచ్‌పై స్టార్ క్రికెటర్ విమర్శలు

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్‌పై పరోక్ష విమర్శలు చేశాడు. ‘నమీబియా మ్యాచ్‌లో నన్ను తొలగించారు. కానీ, నా దృష్టి నా బౌలింగ్‌పై పని చేయడం, తిరిగి ఎలా జట్టులోకి రావాలి అనేది ఆలోచించాను. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను వెళ్లి నా జట్టుకు 100 శాతం ఇస్తాను’ అని పేర్కొన్నాడు.

February 25, 2026 / 11:02 AM IST

జాగ్రత్తగు పాటిస్తూ పనులను చేసుకోవాలి: DRDA

MNCL: వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకుని పనులు చేసుకోవాలని మంచిర్యాల డీఆర్డీఏ పిడి కిషన్ సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ రోటిగూడ అటవీ ప్రాంతాలలో ఉపాధి పనుల ద్వారా చేపట్టిన సిప్- బండ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి కూలికి రోజు రూ.307 వేతనం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

February 25, 2026 / 11:01 AM IST

మెదక్ పోలీసులకు 6 రజత పతకాలు

MDK: తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.

February 25, 2026 / 11:01 AM IST

నేటితో ముగియనున్న ఈ పంట నమోదు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రవి పంటలకు సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగుస్తుందని వ్యవసాయ శాఖ జేడి త్రినాధ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పంట నమోదు తప్పనిసరిగా రైతులు చేసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు పొందాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 11:01 AM IST

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

సత్యసాయి: పెనుకొండ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. మరుపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ బహిరంగంగా పేకాట ఆడుతున్న ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,120 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

February 25, 2026 / 11:00 AM IST

సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు

ATP: బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి కార్తీక్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య బుధవారం మీడియాకు తెలిపారు. ఇటీవల పింఛన్ నగదు రూ.96 వేలను సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ విధించినట్లు వెల్లడించారు.

February 25, 2026 / 11:00 AM IST

ఎమ్మెల్యే బత్తుల సిఫార్సుతో CMRF చెక్కులు పంపిణీ

E.G: కోరుకొండ మండలం కణుపూరులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన కంచు మూర్తి నూకాలమ్మకి రూ 27,100, కొత్తపల్లి రత్న కుమారికి రూ.77,084 విలువగల CMRF చెక్కులను అందజేశామన్నారు.

February 25, 2026 / 11:00 AM IST

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

కడప నగరంలోని బిల్టప్ కూడలి వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామరాజుపల్లెకు చెందిన నాగూరు దస్తగిరమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. పోలేరమ్మ గుడి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దస్తగిరమ్మను 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

February 25, 2026 / 11:00 AM IST

‘సీఎం కప్ పోటీలో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు’

ADB: ఈనెల 20 నుంచి నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం గా పోటీలో అదిలాబాద్ జిల్లా ఖో ఖో జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను కలెక్టర్ రాజర్షి షా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అధికారులు, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 11:00 AM IST

ఇంటర్ పరీక్షలపై డ్రోన్ల నిఘా

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా ముమ్మరం చేశారు. సెక్షన్ 144 అమలులో ఉండగా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

February 25, 2026 / 11:00 AM IST

మెరుగైన వైద్యం అందుతోంది: మంత్రి సత్యకుమార్

AP: డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. కొన్నేళ్లుగా క్లోరినేషన్ జరగలేదని, క్లోరినేషన్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీళ్ల శాంపిల్స్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. తాగునీటి కలుషితం వల్లనే డయేరియా ప్రబలుతోందని వెల్లడించారు. వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం చెప్పారు.

February 25, 2026 / 11:00 AM IST

విద్యార్థికి ఆర్ధిక సహాయం అందజేత

W.G: ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో వీరవల్లి మహేష్ ఇంటర్వెల్లో మరో విద్యార్థి కాలు తగిలి పడిపోగా మహేష్‌కి చెయ్యి విరిగిందని పాఠశాల HM జాన్ బాబు బుధవారం తెలిపారు. అతనికి వైద్య ఖర్చులు రూ. 20 వేల అయ్యిందని మహేష్ తండ్రి పెద్దిరాజు తెలిపారు. ఈ విషయం వసుధ ఫౌండేషన్ దృష్టికి తీసికెళ్లగా వారు రూ .10 వేలు, పాఠశాల సిబ్బంది రూ. 10 వేలను పెద్దిరాజుకు అందించారు.

February 25, 2026 / 11:00 AM IST

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

NGKL: జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ 7,557 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. రేపు సెకండ్ ఇయర్ 7,616 మంది స్టూడెంట్స్ హాజరుకానున్నారని తెలిపారు. తాగునీటి సదుపాయం, గాలి, వెలుతురు లాంటి అంశాలను కలెక్టర్ పర్యవేక్షించారు.

February 25, 2026 / 10:59 AM IST

రోడ్డు మరమ్మతులు ప్రారంభం

SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్ ఆధ్వర్యంలో ధర్మాజీపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతుల పనులను ప్రారంభించారు. రోడ్డుపై గుంతలు పడడంతో RTC బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా JCBతో మరమ్మతుల పనులు చేపట్టారు.

February 25, 2026 / 10:59 AM IST

గతంలోనూ ఆత్మహత్యాయత్నం.. నేడు విగతజీవిగా కోమలి

TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేశారు. BSC చదువుతూ, యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన కోమలి మరణం సోషల్ మీడియాలో విషాదాన్ని నింపింది.

February 25, 2026 / 10:58 AM IST