• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

KRNL: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

February 25, 2026 / 09:44 PM IST

జనసేన నాయకులతో MLA భేటీ

ELR: ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం MLA పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన గణపవరం మండల నాయకులతో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. రేపటి నుంచి ప్రారంభమవుతున్న ప్రారంభమవుతున్న 5వ విడత జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు వల్ల కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.

February 25, 2026 / 09:44 PM IST

ఎంపీడీవో పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి

W.G: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పని తీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 09:43 PM IST

టీమ్ సెలక్షన్ పై శ్రీకాంత్ ఫైర్

భారత్ తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. అసలు కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. ఇలాంటి చెత్త ప్రయోగాలతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని వ్యాఖ్యానించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నాడు.

February 25, 2026 / 09:40 PM IST

విజయనగరం ఆర్డీవో బదిలీ..?

VZM: 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీలోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్యత పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి కూడా ఉన్నారు.

February 25, 2026 / 09:35 PM IST

ఈడుపుగల్లులో కలెక్టర్ పర్యటన

కృష్ణా: కలెక్టర్ బాలాజీ కంకిపాడు(M)లోని ఈడుపుగల్లులో నిర్మాణంలో ఉన్న తారురోడ్డును బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి నిర్మాణ నాణ్యత, గతంలో ఎదురైన ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలంకు చెందిన ఆర్‌అండ్‌బీ డీఈఈ బలరాం పాల్గొన్నారు.

February 25, 2026 / 09:32 PM IST

గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సీపీఐ

GNTR: డ్రగ్స్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో జరిగిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం గంజాయి, కల్తీ ఆహారం నియంత్రించడంలో విఫలమైందన్నారు.

February 25, 2026 / 09:30 PM IST

సెక్రటరికి వినతి ప్రతం అందజేత

WGL: ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల & కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇవాళ DSFI ఆధ్వర్యంలో గురుకులాల సెక్రటరీ సీత లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర( P) శివ వర్మ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మెనూని అందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 09:21 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి సాయం

HYD: రేణుక నగర్‌కు చెందిన సత్యనారాయణ పక్షవాతం, గుండెపోటుతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు షైక్ ఫరీద్, వినీత్ కుమార్ ఆయన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ గుప్త, ఉమేష్ పాల్గొన్నారు.

February 25, 2026 / 09:21 PM IST

‘వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారు’

AP: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 09:20 PM IST

రేపు జింబాబ్వేతో ‘డూ ఆర్ డై’ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రేపు కీలక మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఇందులో భారత్ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

February 25, 2026 / 09:20 PM IST

శక్తి డెయిరీలో పేలుడు.. నలుగురికి గాయాలు

TG: జనగామ జిల్లా శక్తి డెయిరీలో పేలుడు సంభవించింది. ఒవెన్ పేలడంతో నలుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ఓవెన్ చల్లారకముందే ఓపెన్ చేయడంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం దాటికి బాదం సీసాలు పగిలిపోయి సీసాల ముక్కలు కార్మికులకు గుచ్చుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 25, 2026 / 09:19 PM IST

ఐదుగురు నకిలీ డాక్టర్ల గుట్టురట్టు

TG: హైదరాబాద్‌లోని మిర్యాలగూడలో ఐదుగురు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్లు కంటి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విషయం బయటపడింది.

February 25, 2026 / 09:18 PM IST

డైరీలో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

JN: రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరి శక్తి డైరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కూలింగ్ ఛాంబర్లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోవడంతో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 09:16 PM IST

బౌలింగ్ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

సత్యసాయి: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందడి చేశారు. బుధవారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొని ఉత్సాహంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాట్ తోనూ అలరించారు. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

February 25, 2026 / 09:13 PM IST