వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలులో పారదర్శకత ఉండేలా కృషి చేస్తానని చెప్పారు.
AP: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో హైదరాబాద్‌కు బొత్సను తరలించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్ నోడల్ ఆఫీసర్గా డాక్టర్ యస్. రవికుమార్ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నియామకం చేపట్టబడిందని యూనివర్సిటీ వెల్లడించింది. తోటి అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
NLR: మనుబోలులోని ప్రభుత్వ ఆసుపత్రిని DMHO సుజాత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తప్పనిసరిగా నెలకు 10 కాన్పులు చేయాలని సూచించారు. సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వచ్చేలా కృషి చేయాలన్నారు. సీహెచ్వో రాజయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు.
TG: MGBS బస్టాండ్‌లో ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఇందులో మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. చేనేత, హస్తకళలకు చేయూతనిచ్చేలా జీఐ ఆన్ వీల్స్ పేరుతో బస్‌లపై ప్రచారం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ కృషిని ఆయన అభినందించారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలని పాలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందు, మొగులప్ప, నారాయణ, చంద్రశేఖర్, పటేల్ శీను ఉన్నారు.
KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం పాలకేంద్రాన్ని డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాల కేంద్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాలు పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
AP: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో మాట్లాడారు.
మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి, ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాలనాపరమైన అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తహసీల్దార్ వివరించారు.
CTR: నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం పాదిరి గ్రామంలో శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణుల దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు . ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాకు ఘనంగా స్వాగతం పలికారు.
TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కేసీఆర్ తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కాగా మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రభత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సమర్పించింది. అయితే కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు వేశారు.
BDK: భద్రాద్రి రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కళ్యాణం జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
AP: శాసనమండలిలో తాను చూపించిన స్టేట్‌మెంట్ నిజం కాదని మండలి ఛైర్మన్ ఎలా చెబుతారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరిట వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం సీఎస్ పేరిట వస్తుందన్నారు. అసెంబ్లీ సమాచారం సెక్రటరీ జనరల్ పేరిట ఉంటుందన్నారు. మండలి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖ అంటే మండలి ఛైర్మన్ నిర్ణయంగానే పరిగణించకుండా ఎలా ఉంటామని తెలిపారు.
ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏ ఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగును, వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.