• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తుప్పు పట్టిన వాహనాల వేలంతో 10వేల ఆదాయం: సీఐ

KMR: ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం తుప్పు పట్టిన 5 వాహనాలకు నిర్వహించిన వేలంలో 10వేల రూపాయల ఆదాయం వచ్చిందని స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి. షాకీర్ అహ్మద్ తెలిపారు. కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ. హనుమంతరావు ఆదేశాల మేరకు గత 12సంవత్సరాల క్రితం NDPS కింద పట్టుబడిన 5 తుప్పు పట్టిన వాహనాలకు వేలం నిర్వహించడం జరిగింది.

February 25, 2026 / 08:40 PM IST

‘భూదాన భూములపై సమగ్ర విచారణ చేయాలి’

KMM: భూదానం భూములపై సమగ్ర విచారణ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వెల్లడించారు. నిజంగా నిరుపేదలే ఉన్నారా లేదా అని అంశంపై రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డబ్బులు వసూలు చేసి ప్లాట్లు విక్రయించిన వ్యక్తులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

February 25, 2026 / 08:39 PM IST

’15 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ’

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 15 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 08:38 PM IST

అదుపులో డయేరియా: ఎమ్మెల్యే

SKLM: జిల్లాలో డయేరియా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, అవసరమైన వైద్య సిబ్బంది, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, స్వచ్ఛత పాటించాలని సూచించారు.

February 25, 2026 / 08:38 PM IST

తొడ కొట్టిన ఎమ్మెల్యే రఘురామ

W.G: మొదటి రోజు అసెంబ్లీ ‘ఆట విడుపు’ క్రీడా పోటీలలో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, కబడ్డీ ఆటలను ఆడారు. అలాగే ఆటల్లో సరదాగా ఆయన తొడ కొట్టారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రఘురామ అన్నారు.

February 25, 2026 / 08:38 PM IST

ఏఐకి టీసీఎస్‌ భయపడదు: సీఈవో కృతివాసన్‌

ఏఐకి టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఏఐ మార్పులకు అనుగుణంగా తమ కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అంతేగానీ.. కొత్త టెక్నాలజీ చూసి భయపడబోమని అన్నారు. ఏఐ టూల్స్‌ను వినియోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసే విధానంపై తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు కృతివాసన్ వెల్లడించారు.

February 25, 2026 / 08:38 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. మంత్రి సీతక్క

MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 08:38 PM IST

‘ముక్కెర యాకన్నకు ఓయూ డాక్టరేట్’

MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.

February 25, 2026 / 08:37 PM IST

GP నిధుల దుర్వినియోగం పై DLPOకు ఫిర్యాదు

WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై గ్రామ సర్పంచ్ అనూష DLPOకు బుధవారం ఫిర్యాదు చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో రూ. 1,75,703 అక్రమంగా విడుదల చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలకవర్గం, తనకు తెలియకుండా ఫిబ్రవరి 21న హాజరు పట్టికలో సంతకం పేరుతో కార్యదర్శి రజియా మోసం చేసినట్లు సర్పంచ్ ఆరోపించారు.

February 25, 2026 / 08:37 PM IST

నీటి సంపులో పడిన పశువు రక్షణ

అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువును పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్‌పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.

February 25, 2026 / 08:36 PM IST

నీటి సంపులో పడిపోయిప పశువు

అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువు పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్‌పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.

February 25, 2026 / 08:36 PM IST

కడివేడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం

TPT: చిల్లకూరు (M) కడివేడు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోట నుంచి గూడూరుకు ఆటో వస్తుండగా కోట వైపు వెళుతున్న కారు ఢీకొంది. దీంతో ఆటో, కారు నుజ్జునుజ్జయ్యాయి. ఆటో డ్రైవర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 08:36 PM IST

ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 7 లక్షల ఆభరణాల చోరీ

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 08:34 PM IST

ప్రమాదవ శాత్తు క్వారీ కార్మికుడు మృతి

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం (కొండగూడెం)లోని దాపర్తి చిట్టియ్య క్వారీలో పనిచేస్తున్న అవిటి యేసు (42)కు ప్రమాదవశాత్తు బుధవారం తలపై రాయి పడింది. అతడికి గాయం కావడంతో వైద్యం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 25, 2026 / 08:33 PM IST

‘సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’

JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 08:33 PM IST