• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాధ్యతలు లేని నాయకులు పంపిణీ చెయ్యవద్దు’

BHPL: నాలుగో వార్డులో ఇలాంటి బాధ్యత లేని కాంగ్రెస్ నాయకులు రవీందర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం సరికాదని 4వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ విమర్శించారు. గురువారం సాయంత్రం కౌన్సిలర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయాల్సిన మంజూరు పత్తులను అర్హత లేని నాయకులు పంపిణీ చేయొద్దన్నారు. రవీందర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 07:36 PM IST

‘క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీపడాలి’

BDK: క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీ పడుతూ విజయం సాధించేందుకు కృషి చేయాలని మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి అన్నారు. గురువారం జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పినపాక ప్రజాప్రతినిధులు, కరకగూడెం జర్నలిస్టులకు మధ్య జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు.

February 26, 2026 / 07:34 PM IST

‘స్వర్ణాంధ్ర లక్ష్యాల ప్రచారం వేగవంతం చేయాలి’

VSP: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం “స్వర్ణాంధ్ర- 2047” లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:32 PM IST

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలోని MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు జిల్లా కన్వీనర్ జమునా బాయి దరఖాస్తులను ఆహ్వానించారు. 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతులు, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశానికి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో 840, ఇంటర్‌లో 680 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు మార్చి 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 07:32 PM IST

‘ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక దిగుబడి’

SRCL: ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు, ఫర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకీకరణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 07:32 PM IST

మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు ఇవే

PDPL: పెద్దపల్లి మార్కెట్ యార్డులో గురువారం పత్తి విక్రయాలు సజావుగా జరిగాయి. కనిష్ట ధర రూ.5501, గరిష్ట ధర రూ.7468, మోడల్ ధర రూ.7121గా నమోదైంది. 1282 బస్తాల్లో 1371.74 క్వింటాళ్లు విక్రయానికి రాగా, 509 మంది రైతులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 07:32 PM IST

ఎంపీని కలిసిన నేతలు

ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్‌ను గురువారం వేలేరుపాడు, కుకునూరు మండలాల నేతలు కలిశారు. మండలాల అభివృద్ధి, పోలవరం నిర్వాసితుల కష్టాలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ముంపు లేని ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మండలాల్లో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

February 26, 2026 / 07:31 PM IST

రంజాన్ మాసం సహనం సేవా భావానికి ప్రతీక

BDK: మణుగూరు మండలం కూనవరం లో మజీద్-ఎ-బిలాల్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సహనం, సేవా భావం, దయ, సౌభ్రాతృత్వానికీ ప్రతీక అని కొనియాడారు.

February 26, 2026 / 07:31 PM IST

బాల్య వివాహ రహిత జిల్లాగా నిలపాలి: కలెక్టర్

ADB: బాల్య వివాహ రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలో బాల్య వివాహ నిరోధక అధికారులు నిర్వహించిన అభయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 26, 2026 / 07:30 PM IST

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ASF: రెబ్బెన మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు MRO సూర్య ప్రకాశ్ గురువారం తెలిపారు. నారాయణపూర్, కొమురవెల్లి నుంచి మంచిర్యాలకు అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న ఇసుకను అడ్డుకొని ట్రాక్టర్ ఓనర్ కాదబండి ప్రవీణ్ కు రూ.5,000ల జరిమానా విధించినట్లు చెప్పారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MRO హెచ్చరించారు.

February 26, 2026 / 07:30 PM IST

దారుణ హత్యకు గురైన వాంబే కాలనీ వాసి

శ్రీ‌కాకుళం న‌గ‌రం వాంబేకాల‌నీకి చెందిన పైల మోహ‌న‌రావు (48) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఎచ్చెర్ల మండ‌లం పొన్నా వంతెన స‌మీపంలో గురువారం సాయంత్రం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టిఫిన్‌, కిరాణా షాపుల‌ను న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల సంఘటన స్థ‌లానికి చేరుకుని క‌న...

February 26, 2026 / 07:28 PM IST

తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

IND vs ZIM: తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

ధారూర్ బస్టాండ్లో సీసీ పనులు.. ప్రయాణికుల హర్షం

VKB: ధారూర్ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సీసీ ప్లాట్‌పారమ్ పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు పడితే బస్టాండ్ ఆవరణ అంతా మురుగునీరు, బురదతో నిండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికార యంత్రాంగం స్పందించి సీసీ పనులు చేపట్టడంతో ఇకపై సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 07:27 PM IST

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాలకృష్ణ గౌడ్

SRPT: జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హుజూర్ నగర్‌కు చెందిన చెన్నగాని బాలకృష్ణ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. బీసీల అభ్యున్నతి, సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.

February 26, 2026 / 07:27 PM IST