• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రెబ్బెన మహంకాళి జాతరకు కలెక్టర్‌కు ఆహ్వానం

ASF: రెబ్బెన మండలం ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి జాతర వాల్ పోస్టర్లను కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు దేవర వినోద్ కలెక్టర్‌ను కలిసి జాతరకు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణం, 3న మహంకాళి జాతర, బోనాలు, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

March 6, 2026 / 08:12 PM IST

చీపురుపల్లి వైసీపీ పరిశీలకులుగా విశాఖ మహిళ

VZM: చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా విశాఖ జిల్లా వైసీపీ మహిళ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు పరిశీలకులుగా నియమించిన జగన్ మోహన్ రెడ్డికి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 08:11 PM IST

మార్కాపురంలో పొగాకు దగ్ధం.. రూ.8 లక్షల నష్టం

మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయితీ పరిధిలోని మాలపాటి పల్లెలో శుక్రవారం కొండయ్య అనే రైతుకు చెందిన పొగాకు నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 6, 2026 / 08:11 PM IST

శంషాబాద్ జంక్షన్‌లా మారనుంది: రేవంత్

TG: రాబోయే ఐదేళ్లలో శంషాబాద్ జంక్షన్‌లా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నుంచే బుల్లెట్ రైలు ప్రారంభం కానుందన్నారు. ORR లాగా RRR నిర్మించుకుంటామనని భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. మూసీని అభివృద్ధి చేసి.. నైట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

March 6, 2026 / 08:11 PM IST

‘విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలి’

SRCL: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బట్టి పద్ధతిలో కాకుండా పిల్లలకు విషయ పరిజ్ఞానం అందేలా ఇంటరాక్ట్ చేస్తూ బోధన జరగాలన్నారు. ఉన్నతాధికారులు ప్రతి పాఠశాలను నాణ్యతతో తనిఖీ చేసి, రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు.

March 6, 2026 / 08:11 PM IST

మహిళా సంఘాల భవనాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

JGL: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో రూ. 10 లక్షలు, కట్కాపూర్లో రూ. 20 లక్షలు, వస్తాపూర్లో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా సంఘాల నూతన భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. జడ్పీ సీఈవో, ఎంపీడీవో, ఎంపీవో, సర్పంచులు పాల్గొన్నారు.

March 6, 2026 / 08:10 PM IST

జూకల్ యువ రచయితకు ‘నంది’ అవార్డు

BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన యువ పాటల రచయిత మ్యాదరి సునీల్‌ను తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవమైన ‘నంది అవార్డు’ వరించింది. ఇవాళ హైదరాబాద్‌లో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విశేష వేడుకలో ప్రముఖ నటుడు, కమెడియన్ బాబూమోహన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సునీల్‌ను జిల్లా ప్రజలు అభినందించారు.

March 6, 2026 / 08:10 PM IST

పెద్దపంజాణి PHCలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

CTR: పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు అందిస్తున్న చికిత్స విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వలు, వైద్య సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.

March 6, 2026 / 08:10 PM IST

విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్‌పై అవగాహన కార్యక్రమం

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఈ ఓపెన్ హౌస్‌లో భాగంగా పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ సెట్లు, బాంబ్ డిస్పోజల్ ఎక్విప్‌మెంట్, ఇతర భద్రతా ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు.

March 6, 2026 / 08:07 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఛైర్ పర్సన్ పావని

BHNG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇవాళ ప్రారంభమైంది. ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో తంగడపల్లి 5వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 12 వరకు సాగే ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

March 6, 2026 / 08:07 PM IST

రక్తదాన్ మహోత్సవ్ గోడపత్రిక ఆవిష్కరణ

W.G: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ నాగరాణి చేతుల మీదుగా రక్తదాన్ మహోత్సవ్ రక్తదాన అవగాహన కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన్ మహోత్సవ్ పేరిట ఒక నెలరోజులపాటు రక్తదాన అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

March 6, 2026 / 08:05 PM IST

ఇఫ్తార్ విందును ప్రారంభించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే

SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెంలో శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

March 6, 2026 / 08:05 PM IST

‘సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ’

NRPT: నారాయణపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో స్థానిక సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయ నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై రాముడు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని సూచించారు. పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వెంటనే తెలియజేయమని కోరారు.

March 6, 2026 / 08:05 PM IST

పారిశుధ్యంపై మున్సిపల్ కమిషనర్ సీరియస్

MDK: రామాయంపేట మున్సిపల్ కమిషనర్ బి. శ్రావణ్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్, మల్లెచెరువు సమీపంలోని జలవనరులు (వాటర్ బాడీస్), సిద్దిపేట రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం పరిసరాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను చూసి కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 08:05 PM IST

రూ. 1.75 లక్షలు రికవరీ చేసిన పోలీసులు

GDWL: రాజోలి, గద్వాల టౌన్ పరిధిలో లోన్ యాప్స్, టెలిగ్రామ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరిగిన రెండు వేర్వేరు మోసాల్లో బాధితులు కోల్పోయిన రూ. 1,75,244 మొత్తాన్ని పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు. న్యాయస్థానాల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ నిధులను తిరిగి బాధితుల ఖాతాలకు మళ్లించారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 08:05 PM IST