GDWL: రాజోలి, గద్వాల టౌన్ పరిధిలో లోన్ యాప్స్, టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగిన రెండు వేర్వేరు మోసాల్లో బాధితులు కోల్పోయిన రూ. 1,75,244 మొత్తాన్ని పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు. న్యాయస్థానాల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ నిధులను తిరిగి బాధితుల ఖాతాలకు మళ్లించారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.