• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బొంతపల్లిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో ఉన్న బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.

March 8, 2026 / 01:22 PM IST

కెప్టెన్ హేలీకి ఘన వీడ్కోలు

INDwతో స్వదేశంలో జరిగే ఈ మల్టీ ఫార్మాట్ సిరీసే తనకు చివరిదని AUSw కెప్టెన్ అలీసా హేలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏకైక టెస్టు అనంతరం హేలీకి కంగారూ అమ్మాయిలతో పాటు భారత్ ఘన వీడ్కోలు పలికింది. 2010 నుంచి ఆస్ట్రేలియాకు హేలీ అందించిన సేవలు చిరస్మరణీయం. హేలీ ఆరు T20 WC, రెండు వన్డే WC విన్నింగ్ టీమ్స్ మెంబర్. తన సారథ్యంలో ఆసీస్ 2024 T20 WC విజేతగా నిలిచింది.

March 8, 2026 / 01:22 PM IST

1300 బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్(IDBI) వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభం కాగా.. డిగ్రీ ఉత్తీర్ణత, కనీసం రెండేళ్ల పని అనుభవం గలవారు ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1050. SC/ST/PwBDలకు రూ.250.

March 8, 2026 / 01:20 PM IST

బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ

KDP: పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం-2ను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని గదులు, వంటశాల, పరిసరాలను స్వయంగా పరిశీలించిన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ప్రతిరోజు కోడిగుడ్డు, పాలు, ఇతర పోషకాహార పదార్థాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

March 8, 2026 / 01:20 PM IST

తిరువూరులో మహిళ దినోత్సవం వేడుకలు

ఎన్టీఆర్: తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆ పార్టీ మహిళలు ఆదివారం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుధారాణి నివాళులు అర్పించారు. జగన్ పాలనలో మహిళలకు దక్కిన ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నట్లు వారు తెలిపారు.

March 8, 2026 / 01:19 PM IST

‘మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’

W.G: మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆచంట MLA పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ వేడుకల్లో మహిళలు, వివిధశాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

March 8, 2026 / 01:17 PM IST

పెద్దపంజాణి పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్

CTR: జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, పెద్దపంజాణి పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్సై శ్రీ మారెప్ప తన సిబ్బందితో కలిసి 7 లీటర్ల ఐడీ మద్యాన్ని, దాని తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 8, 2026 / 01:15 PM IST

డిపోను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి

WGL: నెక్కొండ మండలం పనికర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సామిల్& టింబర్ డిపోను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా రిబ్బన్ కటింగ్ చేసి మిషన్‌ని స్టార్ట్ చేసారు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించాలని MLA నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 01:15 PM IST

జిల్లా ఉపసర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షుడిని సన్మానించిన MLA

BHPL: జిల్లా ఉపసర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొగిలి శంకర్ను ఆదివారం BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. MLA గండ్ర మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసి మరిన్ని పదవులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్ విజయ్-అశోక్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 01:15 PM IST

‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్‌తో దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వేసవి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 01:15 PM IST

ఏటూరునాగారం సమగ్ర అభివృద్ధికి కృషి: సర్పంచ్

MLG: ఏటూరునాగారం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు వార్డులో ఇవాళ స్థానిక నేతలతో కలిసి సర్పంచ్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గ్రామ అభివృద్ధికి అందరం సమన్వయంతో పని చేద్దామన్నారు.

March 8, 2026 / 01:14 PM IST

సిటీ స్కైలైన్ పిక్నిక్.. ఫ్లైఓవర్ల కింద ఫాస్ట్ ఫుడ్.!

HYD: నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు.

March 8, 2026 / 01:14 PM IST

మేయర్‌గా మమత శ్రీను ముదిరాజ్

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా గుమాల్ మమత శ్రీను ముదిరాజ్ విజయం సాధించారు. అనంతరం కార్పొరేషన్ తొలి మహిళా మేయర్‌గా ఎన్నిక కావడం విశేషం. మధ్య తరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తక్కువ కాలంలోనే కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె నిరూపించారు.

March 8, 2026 / 01:14 PM IST

‘ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోండి’

TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్ తెలిపారు. మార్చి 9న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, 10.30 నుంచి 11.30గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

March 8, 2026 / 01:14 PM IST

హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పారద్రోలడానికి ఎంతో కృషి చేస్తున్నాయన్నారు.

March 8, 2026 / 01:14 PM IST