• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సూపరింటెండెంట్ వ్యాఖ్యలు అవాస్తవం’

E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా 2022లో తిరిగి 100 పడకల స్థాయికి పెంచుతూ జీవో తీసుకొచ్చామని చెప్పారు.

March 3, 2026 / 07:09 AM IST

ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం

NDL: ఆళ్లగడ్డ మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా జ్వాలా నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అర్చకులు రథం వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేసి శుభ ముహూర్తంలో రథాన్ని ముందుకు కదిలించారు.

March 3, 2026 / 07:08 AM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం’

MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి రక్షణ లేకపోవడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. నాగసాలకు చెందిన భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

March 3, 2026 / 07:07 AM IST

జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

W.G: జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

March 3, 2026 / 07:06 AM IST

యుద్ధ దేశాల్లో జిల్లా వాసులకు సహాయం

KDP: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న జిల్లాకు చెందిన పౌరుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న కడప జిల్లావాసులు లేదా వారి బంధువులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 08562-246344 ను సంప్రదించాలని సూచించారు.

March 3, 2026 / 07:05 AM IST

ఇంటర్ విధ్యార్ధి డీబార్

CTR: ఏపీ సార్వత్రిక ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు చిత్తూరులోని ఒక పరీక్షా కేంద్రంలో చీటింగ్‌కు పాల్పడిన విద్యార్థిని డిబార్ చేసినట్లు ఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇంగ్లీషు పరీక్షకు నమోదు చేసిన 1,660 మందిలో 1,361 మంది హాజరైనట్లు వెల్లడించారు. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.

March 3, 2026 / 07:05 AM IST

రథోత్సవంలో పాల్గొన్న MLA ఆనంద బాబు

BPT: భట్టిప్రోలులో సోమవారం రాత్రి జరిగిన భ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 3, 2026 / 07:05 AM IST

తాడ్వాయి ఎంపీడీవోగా రాజేశ్వరరావు

KMR: తాడ్వాయి మండల అభివృద్ధి అధికారిగా రాజేశ్వరరావు సోమవారం సాయంత్రం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా సబితా రెడ్డి పని చేశారు. ఆమె స్థానంలో గాంధారి MPDOగా పని చేసిన రాజేశ్వరరావును బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

March 3, 2026 / 07:05 AM IST

‘కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదు’

BHNG: రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది. ఖాళీ యూరియా బస్తాలలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు.

March 3, 2026 / 07:05 AM IST

ట్రాక్టర్ ఢీకొని వృద్ధ వ్యాపారి మృతి

అన్నమయ్య: రామసముద్రం మండలం దిగువపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన 70 ఏళ్ల చిరు వ్యాపారి ఖాదర్ వలీ మృతి చెందారు. ఖాదర్ వలీ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా పుంగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 3, 2026 / 07:05 AM IST

పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్ట్

ELR: టి.నరసాపురం మండలం శ్రీరామవరంలో సోమవారం పోలీసులు పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండల పరిధిలో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

March 3, 2026 / 07:02 AM IST

నేడు మార్కెట్ యార్డుకు సెలవు

KRNL: హోలీ పండుగ సందర్భంగా కర్నూలు మార్కెట్ కమిటీ యార్డుకు నేడు సెలవు ప్రకటించామని, రైతులు అమ్మకానికి తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం యథావిధిగా మార్కెట్ కమిటీ యార్డులో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు.

March 3, 2026 / 07:02 AM IST

తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం

SRPT: గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని ఐదు తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

March 3, 2026 / 07:01 AM IST

దోమల మందు పిచికారి చేయించిన సర్పంచ్

NZB: కమ్మర్‌పల్లి మండలం కోన సముందర్‌లో సోమవారం సర్పంచ్ రాకేశ్ ఆధ్వర్యంలో వీధుల వారీగా దోమల మందు పిచికారి చేయించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు. పరిసరాలను మాతో పాటు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

March 3, 2026 / 07:01 AM IST

మహిళా బంగారం చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

NLR: సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన మెడలోని 13 సవర్ల బంగారు సరుడు పోయిందని స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలు.. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జ్యోతి నెల్లూరులో ఉంటుంది. సోమవారం తమ ఊరికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి పొదలకూరు బస్సుకు వెళ్లే క్రమంలో తన మెడలో నగ కనిపించకపోయిందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 07:00 AM IST